సోషల్ మీడియాలో ప్రేమ.. ఇంట్లో పెద్దలు ఒప్పుకోరని రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం రాచపల్లికి చెందిన మినుగు రాహుల్(18)కు.. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం ఎర్రచింతల్ గ్రామానికి చెందిన గోలేటి శ్వేత(20)కు మధ్య సామాజిక మాధ్యమంలో కొద్ది నెలల క్రితం పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది.
ప్రేమ విషయం తమ ఇంట్లో ఒప్పుకొరని, క్షణికావేశంలో ఇద్దరు జమ్మికుంట మండలం బిజిగిరిషరీఫ్ రైల్వేస్టేషన్-పాపయ్యపల్లె గేట్ వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు…దర్యాప్తు చేస్తున్నారు.