తెలంగాణ రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నేడు అసెంబ్లీలో రెండు చరిత్రాత్మక బిల్లులు ప్రవేశ పెట్టనుంది. తెలంగాణ రాష్ట్రంలో సామాజిక వర్గాల సంక్షేమాన్ని కాంక్షిస్తూ రెండు చారిత్రాత్మక బిల్లులను నేడు అంటే సోమవారం అసెంబ్లీలో రేవంత్ సర్కార్ ప్రవేశపెట్టనుంది.
బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడంతో పాటు ఎస్సీల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించనుంది. వీటికి ఇప్పటికే కేబినెట్ ఆమోదం తెలపడంతో బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది.