వైసీపీ కీలక నేత, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వైసీపీ కీలక నేత, ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి మాతృ వియోగం కలిగింది. వైవీ సుబ్బారెడ్డి తల్లి ఎర్రంరెడ్డి పిచ్చమ్మ(84) అనారోగ్యంతో ఒంగోలులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రస్తుతం డిల్లీలో ఉన్నారు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి.
అయితే… తల్లి ఎర్రంరెడ్డి పిచ్చమ్మ(84) అనారోగ్యంతో ఒంగోలులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలియగానే… ఢిల్లీ నుంచి హుటా హుటిన ఒంగోలుకు రానున్నారు. మధ్యాహ్నానికి ఒంగోలుకు రానున్నారు వైసీపీ కీలక నేత, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. అంత్యక్రియలు వైవీ స్వగ్రామం కొరిశపాడు నిర్వహించే అవకాశం ఉంది. అంత్యక్రియలకు వైసీపీ అధినేత జగన్, విజయమ్మలు కూడా హాజరయ్యే అవకాశం ఉంది.