రెండు పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడుతున్నాయి : మహేశ్వర్ రెడ్డి

-

రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో హామీల ఎగవేతలు, మాటల గారడీ మాత్రమే కన్పించింది. సీఎం రేవంత్ రెడ్డి ఏకపాత్రభినయం చేశారు అని బిజెఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. గవర్నర్ ప్రసంగంలో.. ప్రభుత్వం ఇచ్చిన హామీల పై నేను అనేక ప్రశ్నలు లేవనెత్తిన వాటిపై సీఎం రేవంత్ రెడ్డి దాటవేసే ధోరణి అవలంభించారు. గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించలేదు.

రేవంత్ రెడ్డి ఏదో చేయబోతుంటే ప్రతిపక్షాలు అడ్డుకుంటుంటున్నాయనీ అంటున్నారు. రుణమాఫీ కానీ, మీరు ఇచ్చిన హామీల అమలు జరిగినా మీరు ఏ శిక్ష వేసినా శిరసావహిస్తాను. మీ మంత్రులకు రివైజ్ డ్ ఎస్టిమేషన్ పేరుతో ఇచ్చే కమీషన్ల మీద ఉన్న ఆసక్తి విద్యార్థులు, రైతుల మీద లేదు. బీఆర్ఎస్ కాంగ్రెస్ డూప్ ఫైట్ చేస్తోంది… ఆ రెండు పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడుతున్నాయి. సమస్యలు చర్చకు రాకుండా ఓ సభ్యుడిని సస్పెండ్ చేశారు. దుబాయ్ రికార్డ్స్ తన వద్ద ఉన్నాయి అంటున్న సిఎం రేవంత్ రెడ్డి ఎందుకు వాటిని బయటపెట్టలేదు. కాళేశ్వరం అవినీతి,ఫార్ములా ఈ కేసు, విద్యుత్ కొనుగోళ్లకు సంభందించిన అంశాలను ఎందుకు బయటపెట్టడంలేదు. మళ్ళీ ఐదేళ్లు కాదు…కనీసం ఈ ఐదేళ్ళు పదవిలో ఉంటామన్న భరోసా కల్పించండి. రేవంత్ రెడ్డి బీజేపీ లోకి వస్తె మా పార్టీ తీసుకుంటుందా..లేదా..? అనే అంశాన్ని అధిష్ఠానం చూసుకుంటుంది అని మహేశ్వర్ రెడ్డి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version