నలుగురు ఎమ్మెల్యేలు ప్రభుత్వ విప్ ల నియామకం

-

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వానికి సంబందించిన కీలక పదవులు అన్ని ఖాళీ కావడం.. కొత్త వారిని నియమించడం అన్నీ చకా చకా జరిగిపోతున్నాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం నిన్న స్పీకర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న విషయం తెలిసిందే.

ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కొత్త విప్ లను ప్రకటించింది. తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వ విప్ ల నియామకానికి సంబంధించి  రేవంత్ రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తాజాగా నలుగురు ఎమ్మెల్యే లను  ప్రభుత్వ విప్  లుగా నియమించింది. ఆలేరే ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ధర్మపురి ఎమ్మెల్యే  అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వేముల వాడ ఎమ్మెల్యే  ఆది శ్రీనివాస్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రామచంద్రనాయక్, లను విప్ లుగా నియమిస్తూ శుక్రవారం సిఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరందరూ మొదటిసారి అసెంబ్లీకి ఎన్నికైన వారు కావడం గమనార్హం. అయితే జిల్లాల్లో మంత్రుల పదవుల సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని విప్ లను నియమించినట్లు స్పష్టం అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version