పెన్షనర్లకు గుడ్ న్యూస్..!

-

పెన్షనర్ల కోసం డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ విధానాన్ని భారత ప్రభుత్వం తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. దీనిని జీవన్ ప్రమాణ్ పత్ర లేదా జీవన ప్రమాణ పత్రం అని అంటారు. అయితే ప్రతీ ఒక్కరు కూడా లైఫ్‌ సర్టిఫికేట్‌ ని సబ్మిట్ చెయ్యాలి లేకపోతె పెన్షన్ ని పొందేందుకు ఇబ్బందులు వస్తాయి.

బ్యాంకు, పోస్టాఫీసు లేదా పెన్షన్‌ డిస్‌బర్సింగ్‌ అథారిటీలకు ఈ లైప్‌ సర్టిఫికేట్‌ను సబ్మిట్ చెయ్యాలి. అప్పుడే నెలవారీ పెన్షన్ వస్తుంది. డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ను జనరేట్‌ చేసేందుకు పెన్షనర్లు సాఫ్ట్‌వేర్ అప్లికేషన్, సెక్యూర్‌ ఆధార్ బేస్డ్‌ బయోమెట్రిక్ అథెంటికేషన్‌ సిస్టమ్‌ ని ఉపయోగించాల్సి వుంది. పెన్షన్ డిస్‌బర్సింగ్‌ అధికారి దగ్గరకి వెళ్ళక్కర్లేదు. ఇది డిజిటల్‌గా అందుబాటులో ఉంటుంది.
ఆటోమేటిక్‌గా ప్రాసెస్ అవుతుంది.

ఐడీ అనేది వేరుగానే ఉంటుంది. జీవన్ ప్రమాణ్ యాప్‌ ని మీ డివైజ్ లో డౌన్లోడ్ చేసుకుని డాక్యుమెంట్ కోసం నమోదు చెయ్యాలి లేదంటే జీవన్ ప్రమాణ్ సెంటర్‌ కి వెళ్లి రిజిస్టర్ చేసుకోవచ్చు. అలానే ఆధార్ అథెంటికేషన్‌ కూడా అవసరమే. బయోమెట్రిక్‌లను ఇవ్వాల్సి వుంది. ఆధార్ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించే ఆన్‌లైన్ బయోమెట్రిక్ అథెంటికేషన్‌ అవుతుంది. అథెంటికేషన్‌ అయ్యాక జీవన్ ప్రమాణ్ సర్టిఫికేట్ ID మొబైల్ నంబర్‌కు SMS వస్తుంది. ఈ సర్టిఫికేట్ IDలు పెన్షనర్, పెన్షన్ డిస్బర్సింగ్ ఏజెన్సీల కోసం ఇవి లైఫ్ సర్టిఫికేట్ రిపోజిటరీ లో స్టోర్‌ అయ్యి ఉంటాయి. కనుక ఎప్పుడైనా వీటిని యాక్సెస్‌ చెయ్యచ్చు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version