అపోలో డాక్టర్ ఆడియోపై పోలీసులకు ఫిర్యాదు…!

-

కరోనా పుణ్యమా అని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం మాత్రం విస్తృతంగా జరుగుతుంది. ఎవరికి తోచిన ప్రచారం వాళ్ళు సోషల్ మీడియాలో చేస్తున్నారు. కరోనా రోగం కంటే ఈ తప్పుడు ప్రచారం ఎక్కువగా ఉంది. ప్రతీ చిన్న విషయానికి పెద్ద పెద్ద అంశాలను జోడించి ఇప్పుడు దీన్ని ప్రచారం చేస్తున్నారు. కొంత మంది ఈ తప్పుడు ప్రచారం తో సోషల్ మీడియాలో పాపులర్ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు.

తాజాగా సోషల్ మీడియాలో ఒక డాక్టర్ మాట్లాడినట్టు ఒక ఆడియో వైరల్ అయింది. “అపోలో సూపర్ స్పెషాలిటీ లో ఉన్నటువంటి ఒక సీనియర్ డాక్టర్ కి ఒక సీనియర్ రిపోర్టర్ కి మధ్య జరిగిన ఫోన్ కాల్ సంభాషణ పరిస్థితి ఎంత భయంకరంగా మారిపోతుంద అనేది ఆయన చెప్పింది దయచేసి ఈ ఆడియో పూర్తిగా విని సాధ్యమైనంతవరకు అందరికీ షేర్ చేయండి మన సమాజాన్ని మనమే బతికించుకోవాలి మానవ మనుగడని మనమే కాపాడుకోవాలి”

అంటూ ఒక 8 నిమిషాల ఆడియో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది. దీనిపై అపోలో స్పందించింది. సైబర్ క్రైమ్ కి అపోలో ఫిర్యాదు చేసింది. అసలు ఆ ఆడియో కి తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. దీనిపై పోలీసులు విచారణ ముమ్మరం చేసారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై పలువురు ఆందోళన వ్యక్తం కూడా చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version