సంక్రాంతికి ఊరెళ్లవారికి శుభవార్త చెప్పిన ఏపీఎస్ఆర్టీసీ

-

వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి పండుగకు సొంతూర్లకు వెళ్లేవారికి ఏపీఎస్‌ఆర్టీసీ శుభవార్త చెప్పింది. మహానగరమైన హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు వెళ్లే ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా బస్సులను నడుపనున్నట్లు ప్రకటించింది. అందుకోసం ఏకంగా 2,400 ప్రత్యేక బస్సులను సిద్ధం చేసినట్లు తెలిపింది. జనవరి 9 నుంచి 13వ తేదీల మధ్య ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.

అంతేకాకుండా ఈ బస్సుల్లో సాధారణ చార్జీలే అందుబాటులో ఉంటాయని, అదనపు చార్జీలు వసూలు చేయబోమని ప్రకటించింది. ఎంజీబీఎ‌స్‌లో రద్దీని తగ్గించేందుకు జనవరి 10 నుంచి 12 మధ్య కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు, మాచర్ల వైపు వెళ్లే బస్సులను సెంట్రల్ బస్ స్టేషన్ ( గౌలిగూడ) నుంచి నడిపించనున్నట్లు వెల్లడించింది.ఇదిలాఉండగా,సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఇప్పటికే రైళ్లలో భారీగా వెయిటింగ్ లిస్టు దర్శనమిస్తున్నట్లు ప్యాసింజర్స్ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news