యువకుడిని స్తంభానికి కట్టేసి కొట్టిన ఆక్వా రైతులు.. ఎందుకంటే?

-

ఏపీలో దారుణం చోటుచేసుకుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం సన్నవిల్లికి చెందిన చిక్కం వీర దుర్గాప్రసాద్ గత కొంతకాలంగా అక్రమ ఆక్వా చెరువుల తవ్వకాలపై న్యాయ పోరాటం చేస్తున్నాడు. గ్రామంలో ఆక్వా చెరువుల తవ్వకాల వలన పర్యావరణంతో పాటు తాగు నీరు కాలుష్యం అవుతుందని పోరాటం చేయడంతో పాటు కోర్టుకు వెళ్ళాడు.

దీనిపై విచారించిన కోర్టు చెరువుల తవ్వకాలను నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అధికారులు అక్రమ చెరువుల తవ్వకాలకు సంబంధించిన ఫోటోలు పంపాలని దుర్గాప్రసాద్‌ను కోరారు. ఈ క్రమంలోనే చెరువుల దగ్గరకు వెళ్ళిన వీర దుర్గాప్రసాద్‌ను ఆక్వా రైతులు స్తంభానికి కట్టి చితకొట్టారు. అనంతరం వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.అది కాస్త ప్రస్తుతం వైరల్ అవుతోంది. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news