ఎ ఆర్ రెహమాన్ ఇంట తీవ్ర విషాదం

-

ప్రముఖ సంగీత దర్శకుడు ఎఆర్ రెహమాన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఏఆర్ రెహమాన్ తల్లి కరీమా బేగం ఈ రోజు ఉదయం కన్ను మూశారు. రెహమాన్ యవ్వనంలో ఉన్నప్పుడే ఆయన తండ్రిని కోల్పోగా అప్పటి నుండి ఆయనని తల్లే జాగ్రత్తగా పెంచి చేసింది. దీంతో రెహమాన్ కు తన తల్లితో అనుబంధం ఎక్కువ. ఇప్పుడు ఆమె మృతి చెందడంతో రెహమాన్ కుటుంబం అంతా తీవ్ర విషాదంలోకి వెళ్లింది.

ఆర్థిక ప‌రిస్థితులు అంతంత మాత్ర‌మే ఉన్న‌ప్ప‌టికీ.. సంగీతంపై రెహ‌మాన్‌కి ఉన్న శ్ర‌ద్ధ‌ను చూసి ఆ దిశ‌గా రెహమాన్ కు కరీమా బేగం ప్రోత్సాహం అందించారు. అందుకే త‌న తల్లిపై రెహ‌మాన్ ప్రేమ‌ను చూపుతూ వ‌చ్చారు. ఇక కరీమా బేగం మృతికి సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. ఇక దాదాపు అన్ని భాషల సినిమాలకి రెహమాన్ సంగెతం అందిస్తున్నారు. స్లం డాగ్ మిలియనీర్ సినిమాకు గాను అయన ఆస్కార్ కూడా అందుకుని ఇండియా పరువు నిలిపారు. 

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version