నిరుద్యోగులకు బ్యాంక్ ఆఫ్ బరోడా శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బ్యాంకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది.దేశంలో రెండో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగినవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు
మొత్తం 21 పోస్టులను భర్తీ చేస్తున్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా నోటిఫికేషన్ విడుదల చేసింది. సెక్యూరిటీ ఆఫీసర్, ఫైర్ ఆఫీసర్ విభాగాలకు సంబంధించిన పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. మొత్తం ఐదు విభాగాల్లో పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఒక్కో పోస్టుకు ఒక్కో రకమైన అర్హతలు నిర్ణయించారు..అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు రాత పరీక్ష తేదీ, సమయం తదితర వివరాలు తెలపనున్నారు . రాత పరీక్షలో ప్రతిభ చూపిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ ఉంటుంది. స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుకు ధరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు డిగ్రీ అర్హత ఉండాలి. 25 నుంచి 40 ఏళ్ల లోపు వయస్సు ఉండాలి.ఫైర్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు బీఈ, ఎన్‌ఎఫ్‌ఎస్‌సీ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 23 నుంచి 35 ఏళ్లు ఉండాలి. ఎంపికైన అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ బరోడాలోని వివిధ బ్రాంచుల్లో పని చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
అప్లికేషన్ ఫీజును రూ. 600గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఇచ్చారు. వారు కేవలం రూ. 100 ఫీజు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది.స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుకు ధరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు డిగ్రీ అర్హత ఉండాలి. 25 నుంచి 40 ఏళ్ల లోపు వయస్సు ఉండాలి.ఫైర్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు బీఈ, ఎన్‌ఎఫ్‌ఎస్‌సీ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 23 నుంచి 35 ఏళ్లు ఉండాలి.