అరటికాయ చిల్లా.. చిన్నపిల్లలు ఇలా పెడితే.. వదిలిపెట్టకుండా తినేస్తారు.!

-

అరటికాయ కూడా ఒక రకమైన దుంపే.. వీటితో మనం ఫ్రై చేసుకుని తింటాం. ఇందులో కాలరీలు ఎక్కువగా ఉంటాయి.. దుంపల్లో ఉండే కాలరీలు, శక్తీ అరటికాయలో కూడా ఉంటాయి. అందుకే.. బరువు పెరగాలనుకునేవారు.. అరటికాయతో ఏ వెరైటీ అయినా చేసుకుని హ్యాపీగా తినొచ్చు. తగ్గాలనుకునే వారు మాత్రం తక్కువగా తినాలి. ఎదిగేపిల్లలకు అరటికాయ పెడితే చాలా మంచిది కానీ వాళ్లు అసలు తినరుగా.. మరి అందుకే అరటికాయతో కాస్త వెరైటీగా చేస్తే.. ఇష్టంగా తింటారు.

అరటికాయ చిల్లా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు..

పచ్చిఅరటికాయ ఒకటి
బంగాళదుంప చిన్నది ఒకటి
పెరుగు అరకప్పు
పుట్నాలపప్పు పొడి రెండు టేబుల్ స్పూన్
ఉల్లిపాయ ముక్కలు రెండు టేబుల్ స్పూన్స్
టమోటా ముక్కలు రెండు టేబుల్ స్పూన్స్
క్యారెట్ తురుము రెండు టేబుల్ స్పూన్స్
పుదీనా రెండు టేబుల్ స్పూన్స్
అల్లం ముక్కలు ఒక టేబుల్ స్పూన్
మిరియాల పొడి ఒక టేబుల్ స్పూన్
మీగడ ఒక టేబుల్ స్పూన్
లెమన్ జ్యూస్ ఒక టేబుల్ స్పూన్
జీలకర్ర ఒక టీ స్పూన్
కొత్తిమీర కొద్దిగా

తయారు చేసే విధానం..

పచ్చి అరటికాయ తొక్క తీసేసి.. బాగా తురుముకోవాలి. బంగాళదుంప కూడా చెక్కు తీసి తురుముకోవాలి. వీటిలో పసుపు, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, కొత్తిమీర, టమోటా ముక్కలు, పుదీనా, నిమ్మరసం, క్యారెట్, పుట్నాల పప్పు పౌడర్ వేసి కలిపి పుల్లటి పెరుగు వేసి కలపండి.. నీళ్లు పోయకూడదు గుర్తుపెట్టుకోండి. ఇలా కలిపేసి.. నానస్టిక్ ప్యాన్ మీద.. దోశలా వేయండి. నూనె కూడా వేయక్కర్లేదు. డైరెక్టుగా.. వేసేయండి. మూతపెట్టి సిమ్ లో ఉంచి.. నాలుగు నిమిషాలు తర్వాత మీగడ రాసి వేరే సైడ్ తిప్పండి. అటు సైడ్ కూడా మీగడ రాసి కాలిస్తే.. మంచి కలర్ ఫుల్ గా వస్తుంది. అంతే.. టేస్టీ.. అరటికాయ చిల్లా రెడీ.. ఈవినింగ్ ఒక రెండు చేసుకుని తిన్నారంటే మంచి స్నాక్ అవుతుంది. డిన్నర్ లా కూడా ఇవి తీసుకోవచ్చు.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version