అమ్మాయిలు మీ బాయ్‌ఫ్రెండ్‌ గడ్డంమీద కిస్‌ చేస్తున్నారా..? జర ఆగండి..!

-

అమ్మాయిలు అబ్బాయిల్లో ముందు చేసేది వాళ్లు హెయిర్‌ స్టైల్‌, గడ్డం. ఇవి స్టైల్‌గా ఉంటే చాలు.. చాలా మంది అమ్మాయిలు ఫ్లాట్‌ అవుతారు. అబ్బాయిలుకు కూడా ఇవి రెండే అందాన్ని పెంచుతాయి. బాయ్ ఫ్రెండ్‍ను గడ్డం పెంచమని మారం చేసే అమ్మాయిలు చాలా మందే ఉన్నారు. భర్తలను గడ్డంతో చూసి హ్యాపీగా ఫీల్ అయ్యే భార్యలూ ఉన్నారు. అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి.. మీ బాయ్‌ఫ్రెండ్‌ గడ్డం బాగుంది కదా అని.. గడ్డంపై కిస్‌ అస్సలు చేయకండి. ఇది చాలా డేంజర్‌.!

ముఖ్యంగా పురుషుల గడ్డం వల్ల మహిళలకు అనేక సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. గడ్డంలో చాలా ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉంటుంది. మీరు ఒక అమ్మాయితో ప్రైవేట్‍గా ఇంటరాక్ట్ అయినప్పుడు, మీ ముఖంతో ఆమె ముఖాన్ని తాకడం వల్ల సమస్యలు వస్తాయి. ఆమె ముఖం దెబ్బతినే అవకాశం ఉంది. చర్మంపై ప్రమాదాన్ని పెంచుతుంది.

మందపాటి గడ్డంతో ఉన్న వ్యక్తిని ముద్దుపెట్టుకునే స్త్రీకి ఇంపెటిగో వచ్చే అవకాశం ఉంది. ఇది ఒక రకమైన స్కిన్ ఇన్ఫెక్షన్, అంటువ్యాధి. ఇది వ్యాధి వస్తే చర్మంపై ఎర్రటి దద్దుర్లు కనిపిస్తాయి. ఇది తీవ్రమైన సమస్య కాదు. అయితే ఇది మహిళలను చికాకుపెడుతుంది. యాంటీబయాటిక్ క్రీమ్ లేదా మాత్రలు తీసుకోవడం ద్వారా ఇంపెటిగోను నయం చేయవచ్చు. కొన్నిసార్లు ఇది మిమ్మల్ని తీవ్రంగా ఇబ్బందిపెడుతుంది.

గడ్డం మీద కొంతమంది అమ్మాయిలు కోరుకుతారు. ఇలాంటి సమయంలో హానికరమైన బ్యాక్టీరియా లోపలికి వెళ్లే అవకాశం ఉంది. చాలామంది మగవారు తల వెంట్రుకలపై పెట్టిన శ్రద్ధ, గడ్డంపై పెట్టరు. ఈ కారణంగా సూక్ష్మక్రిములు అక్కడ పేరుకుపోయి ఉంటాయి. మీ ప్రియమైన వారు మీ గడ్డం మీద ముద్దు పెడితే హానికరమైన బ్యాక్టీరియాతో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది.

కొంతమంది మహిళలకు గడ్డాలు, మీసాలు శృంగారం సమయంలో చికాకుపెడతాయి. అలాగే దీని వల్ల చాలా ఇబ్బందులు పడేవారూ ఉన్నారు. వేసవిలో గడ్డం ట్రిమ్ చేసినట్లే చలికాలంలో గడ్డం కూడా కత్తిరించుకోండి అంటున్నారు నిపుణులు. గడ్డాలపై చాలా పరిశోధనలు జరిగాయి. గడ్డం లేని వారి కంటే గడ్డం ఉన్నవారు శుభ్రంగా ఉంటారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎందుకంటే గడ్డం ఉన్నప్పుడు ముఖ చర్మాన్ని నేరుగా తాకలేరు. గడ్డం అందంగా ఉండాలంటే పురుషులు దానికి కొన్ని క్రీమ్స్ రాసుకోవడమే కాకుండా శుభ్రంగా ఉంచుకోవడంపై కూడా ఎక్కువ శ్రద్ధ చూపుతారు. అయితే గడ్డం ఉన్న పురుషుల నుంచి మహిళలు పారిపోతారని మరో అధ్యయనం వెల్లడించింది. గడ్డం ఉన్న వ్యక్తి కోపంగా, అహంకారంతో కనిపిస్తాడని అధ్యయనంలో పాల్గొన్న చాలా మంది మహిళలు చెప్పారు. కాబట్టి గడ్డం పెంచుకునే అబ్బాయిలు.. మీ బియర్డ్‌ను క్లీన్‌గా ఉంచుకోవడంతో పాటు, నీట్‌గా మెయింటేన్ చేసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news