టిడిపి నేతలు లింగ పరిశోధనలో నిష్ణాతులా?: కొడాలి నాని

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్ గా మారిన హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో పై స్పందించారు మాజీ మంత్రి కొడాలి నాని. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆ వీడియోలో ఉన్నది తాను కాదని గోరంట్ల మాధవ్ చెబుతున్నా.. టిడిపి నేతలు సిగ్గు లేకుండా వాదిస్తున్నారని మండిపడ్డారు. ఆ వీడియో ఫేక్ అని పోలీసులు తెలిపినా టిడిపి కావాలనే రాద్ధాంతం చేస్తుందని అన్నారు. టిడిపి నేతలు లింగ పరిశోధనల్లో నిష్ణాతులా? అంటూ మండిపడ్డారు.

రాష్ట్రంలో ప్రజా సమస్యలను గాలికి వదిలేసి అనవసర విషయాలపై టిడిపి నేతలు దృష్టి పెట్టడం సిగ్గుచేటని ఆయన అన్నారు. పదేపదే ఒక అబద్ధాన్ని ప్రచారం చేస్తే నిజం అవుతుందనే భ్రమలో టిడిపి నేతలు ఉన్నారని అనిపిస్తోందని అన్నారు కొడాలి నాని. ఎంతమంది కలిసి వచ్చినా వైసీపీ పార్టీని గానీ, వైయస్ జగన్మోహన్ రెడ్డిని కానీ ఏమీీ చేయలేరని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version