తెలంగాణా రైతులకు శుభవార్త. యాసంగి సీజన్‌కి సంబంధించి ఈ నెల 28 నుంచి అంటే రేపటి నుంచి రైతుల అకౌంట్ లో రైతు బంధు డబ్బులు జమ చెయ్యాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. సంక్రాంతిలోపు రైతులందరీ ఈ డబ్బులు జమ కావాలని కేసీఆర్ ఆదేశించారు.
ఇందుమేరకు ఆర్ధికశాఖ మంత్రి హరీష్ రావును కేసీఆర్ ఆదేశించారు. రేవటి నుంచి రైతుబంధు డబ్బులు జమ చెయ్యనున్నారు. ఇదిలా ఉంటే కరీంనగర్ జిల్లా రైతులకు ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. రైతులు జనవరి 7లోగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పింది. కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన వారు రైతుబంధు పొందేందుకు దరఖాస్తు చేసుకోమని చెప్పారు.