విజయ్ దేవరకొండ.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన కెరీర్ మొదలుపెట్టిన ఈయన అతి తక్కువ సమయంలోనే హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక పెళ్లిచూపులు సినిమా ద్వారా హీరోగా తన కెరీర్ ను మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ అతి తక్కువ సమయంలోనే అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోగా గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ ఆ తర్వాత నటించినా గీతాగోవిందం సినిమాతో కూడా మరింత ఇమేజ్ నున్ సొంతం చేసుకున్నారు. ఇకపోతే ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఇటీవల పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సినీమాతో ఓవర్ నైట్ లోనే పాన్ ఇండియా హీరోగా చలామణి అవుతున్నారు.
ఇకపోతే లైగర్ సినిమా కథపరంగా డిజాస్టర్ అయినప్పటికీ కూడా ఈ సినిమా ద్వారా విజయ్ దేవరకొండకు మంచి గుర్తింపు లభించింది. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం విజయ్ దేవరకొండ కథల ఎంపిక విషయంలో ఆయనపై ఎక్కువగా ఆధారపడతారట. ఆయన ఎంపిక చేసిన కథలనే విజయ్ దేవరకొండ కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తాడని సమాచారం కూడా ఉంది. టైగర్ సినిమా డిజాస్టర్ కావడంతో ఈ విషయం కాస్త వెలుగులోకి వచ్చింది. ఇకపోతే విజయ్ దేవరకొండ సినిమా కథల ఎంపిక విషయంలో ఎవరి హస్తం ఉంది అనే విషయానికి వస్తే విజయ్ దేవరకొండ తండ్రి వర్ధన్ పేరు బాగా వినిపిస్తోంది. చెప్పాలంటే ముందు ఆయనకు కథ వినిపించాలని వార్తలు వస్తున్నాయి.. ఆయన ఓకే చెప్తేనే విజయ్ వరకు కథ వెళుతుందని ప్రచారం కూడా ఉంది.
నిజానికీ స్టార్ హీరోలు .. కొడుకులకు సంబంధించిన సినిమాల విషయంలో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. ఇక కథ కూడా వారికి నచ్చితేనే ప్రొసీడ్ అవ్వమని చెబుతారు . ఈ విషయంపై ఆయన స్వయంగా క్లారిటీ ఇవ్వడం జరిగింది.. ఇకపోతే ఆయన మాట్లాడుతూ.. విజయ్ సినిమా కథలకు సంబంధించి కథలు తాను వింటున్నానని అనడంలో ఎలాంటి నిజం లేదు. విజయ్ కి కథలపై మంచి జడ్జిమెంట్ ఉంది. విజయ్ తనకథలన్నీ స్వయంగా తానే వింటాడు.. ఎప్పుడైనా ఆ కథల గురించి తనతో చర్చిస్తాడే తప్ప అంతకుమించి తన ప్రమేయం ఉండదు అని స్పష్టత ఇచ్చారు.