మీరు మీ జుట్టుని సరిగ్గా దువ్వుకుంటున్నారా? ఒక్కసారి చెక్ చేసుకోండి..

-

మారుతున్న జీవన విధానాలు, ఆహారాపు అలవాట్ల కారణంగా జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు వస్తున్నాయి. చాలా సార్లు ఈ కారణాలే జుట్టు రాలిపోవడానికి కారణం కాకపోవచ్చు. జుట్టుని సరిగ్గా దువ్వుకోకపోవడం కూడా ఒక కారణం అవుతుందై ఎవరూ గుర్తించరు. కానీ అసలైన విషయం ఏమిటంటే, సరిగ్గా దువ్వుకోకపోవడం వల్ల జుట్టు చింపిరిగా మారి, విఛ్చిన్నం అవుతూ, జుట్టు ఊడిపోవడానికి కారణం అవుతుంది. అందుకే జుట్టు దువ్వుకోవడం తెలియాలి.

ముఖ్యంగా జుట్టు దువ్వుకోవడానికి చెక్క దువ్వెనలు ఉత్తమమైనవి.

ఇవి తలపై ఉండే సహజ నూనెలని జుట్టు అంతటికీ ప్రసరించేలా చేసి మెరిసే గుణాన్ని అందిస్తాయి.
మీ వెంట్రుకలపై స్టాటిక్ విద్యుత్ ని నిరోధించి, వెంట్రుకలని మెత్తగా తయారు చేస్తాయి.
చుండ్రును తగ్గించడమే కాకుండా దువ్వుకునేటపుడు చిరాకుని కలిగించకుండా జుట్టు పెరుగుదలకి సాయపడుతుంది.
ఇంకా, దువ్వెన పళ్ళ మధ్య ఎక్కువ గ్యాప్ ఉండేలా చూసుకోండి.

దువ్వుకునేటపుడు దిగువ నుండి మూలాల వరకు దువ్వుకోవాలి. మీకు పొడవాటి జుట్టు ఉంటే ఈ విధంగా దువ్వుకోవడం ఉత్తమం. ముఖ్యంగా ప్లాస్టిక్ దువ్వెనలని వాడకపోవడం ఉత్తమం. దానివల్ల స్టాటిక్ విద్యుత్ ఏర్పడి అది వెంట్రుకల మీద ప్రభావం చూపి, జుట్టు ఊడిపోయేలా చేస్తుంది.

మీ దువ్వెనని కనీసం రెండు వారాలకి ఒకసారైనా శుభ్రం చేసుకోవాలి. క్రిమినాశన మందుతో శుభ్రపర్చుకుంటే దాని మీద ఉండే బాక్టీరియా చనిపోతుంది. లేదంటే అలాగే వాడుతూ ఉంటే చుండ్రు ఏర్పడడం, జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. దువ్వుకునేటపుడు ఈ విషయాలు మైండ్ లో పెట్టుకుని ఉంటే జుట్టుకి సంబంధించిన సమస్యలని నివారింవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version