పుచ్చకాయలను ఫ్రిడ్జ్‌లో పెట్టి తింటున్నారా..? అయితే నో యూస్‌

-

వచ్చేది సమ్మర్‌.. ఈ సీజన్‌లో కొబ్బరి నీళ్లు, పుచ్చకాయలకు డిమాండ్‌ పెరుగుతుంది. మధ్యాహ్నం వేళ పుచ్చకాయలు తింటుంటే భలే హాయిగా ఉంటుంది. అయితే పుచ్చకాయను సగం తిన్నాక.. చాలామంది వాటిని ఫ్రిడ్జ్‌లో పెడుతుంటారు. మనకు ప్రతీది ప్రిడ్జ్‌లో పెట్టడం బాగా అలవాటు. అయితే దీనిని రిఫ్రిజిరేటర్‌లో నిల్వ ఉంచడం మాత్రం మంచిది కాదని అంటున్నారు నిపుణులు. అలా చేస్తే దాని పోషకాలు ఉండవు.
పుచ్చకాయలను ఫ్రిజ్లో పెడితే.. దాని పోషక విలువ తగ్గుతుంది. అమెరికాలోని వ్యవసాయ విభాగం (USDA) అధ్యయనంలో తెలిసింది. జర్నల్ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ ఫుడ్ కెమిస్ట్రీలో ఇది ప్రచురితమైంది. గదిలో సాధారణంగా పెట్టే.. పుచ్చకాయలతో పోలిస్తే.. ఫ్రిజ్‌లో పెట్టిన పుచ్చకాయల పోషకాలు తక్కువగా ఉంటాయి.
పరిశోధకులు 14 రోజుల పాటు అనేక రకాల పుచ్చకాయలను పరీక్షించారు. వారు ఈ పుచ్చకాయలను ఫ్రిజ్‌లో నిల్వ చేశారు. సాధారణంగా గదిలో ఉన్నవాటిలోనే పోషకాలు ఎక్కువగా ఉన్నాయని తెలిసింది. పుచ్చకాయను తీసుకున్న తర్వాత కూడా కొన్ని పోషకాలను ఉత్పత్తి చేస్తూనే ఉంటుందని వారు వివరిస్తున్నారు. పండ్లను శీతలీకరించడం వల్ల మొత్తం ప్రక్రియ మందగిస్తుంది లేదా ఆగిపోతుంది. రిఫ్రిజిరేటెడ్ ఉష్ణోగ్రత వద్ద అవి ఒక వారంలో కుళ్ళిపోవచ్చు. పుచ్చకాయ సాధారణంగా 14 నుండి 21 రోజులు వరకు ఉంటుంది.
వేసవిలో తీపి, జ్యూసీ పుచ్చకాయలను తినడం ఆరోగ్యం. ఇది సూపర్ హైడ్రేటింగ్, కొద్ది సమయంలోనే మనల్ని చల్లబరుస్తుంది. ఇది పోషకాలతో నిండి ఉంటుంది. పుచ్చకాయ అమైనో ఆమ్లం సిట్రులైన్, రక్తపోటును నియంత్రించి రక్త ప్రవాహాన్ని మెరుగుపరిచే నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇది శరీరంలోని డిటాక్స్, మంటతో పోరాడటానికి సహాయపడుతుంది. అంతేకాకుండా, ఇది తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది.
పుచ్చకాయలు ఆరోగ్యానికి చాలా మంచివి. వేసవిలో బాడిని డీ హైడ్రేట్‌గా ఉంచేందుకు ఇవి చాలా బాగా పనిచేస్తాయి. ఎలాగూ తింటున్నారు అనేది ముఖ్యం.. కాబట్టి పుచ్చకాయలను ఇక నుంచి అయినా ఫ్రిడ్జ్‌లో పెట్టకండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version