మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు భారీ షాక్ తగిలింది. శివసేన పేరు, ఆ పార్టీ ఎన్నికల గుర్తు అయిన విల్లు-బాణం.. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే నేతృత్వంలోని వర్గానికే చెందుతుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
2018లో సవరించిన శివసేన పార్టీ రాజ్యాంగాన్ని అప్రజాస్వామికంగా అభివర్ణించిన ఈసీ.. ఎలాంటి ఎన్నికలు లేకుండా సొంత కోటరీలోని వ్యక్తుల్ని పార్టీ పదాధికారులుగా అప్రజాస్వామికంగా నియమించుకునేలా రాజ్యాంగంలో మార్పులు చేసుకున్నారని స్పష్టం చేసింది. ఈ తరుణంలోనే ఇవాళ ఈ వివాదంపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఉద్ధవ్ థాక్రే. విల్లు, బాణం గుర్తును ఏక్‌నాథ్ షిండే శివసేనకు ఈసీ కేటాయించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఉద్ధవ్ థాక్రే. అత్యవసర విచారణకు నిరాకరించిన సుప్రీంకోర్టు… రేపు విచారణ జరపనుంది.