ఆహారాన్ని అల్యూమినియం ఫాయిల్ లో పెడుతున్నారా..? అయితే ఈ సమస్యలు తప్పవు..!

-

అల్యూమినియం ఫాయిల్: చాలా మంది ఆహార పదార్థాలని అల్యూమినియం ఫాయిల్ లో కట్టి తింటూ ఉంటారు. స్కూల్ కాలేజ్ పిల్లలకి కూడా చపాతీలు రోటీలు వంటివి అల్యూమినియం ఫాయిల్ లో ర్యాప్ చేసి తల్లిదండ్రులు ప్యాక్ చేస్తూ ఉంటారు మీ ఇంట్లో కూడా అదే ప్రాసెస్ ని ఫాలో అవుతున్నారా..? అయితే కచ్చితంగా మీరు వీటిని చూడాలి. అల్యూమినియం ఫాయిల్ లో చుట్టిన ఆహార పదార్థాలను తీసుకుంటే కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

అల్యూమినియం ఫాయిల్ లో ఎప్పుడూ కూడా అసిడిక్ ఉండే వాటిని ప్యాక్ చేసుకోకూడదు కెమికల్ బ్యాలెన్స్ అవుతుంది. టమాట చట్నీ సిట్రస్ ఫ్రూట్స్ వంటి వాటిని అల్యూమినియం
ఫాయిల్ లో చుట్టి పట్టుకెళ్ళకండి.
చాలామంది వేడివేడి ఆహార పదార్థాలని అల్యూమినియం ఫాయిల్ లో చుట్టి పట్టుకుని వెళుతుంటారు ఇలా చేయడం వలన కెమికల్స్ ఫుడ్ లోకి వెళ్లే అవకాశం ఉంది. ఇలాంటి ఆహారం తీసుకోవడం వలన పలు రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి.
పాడైపోయిన ఆహార పదార్థాలని అల్యూమినియం ఫాలో చుట్టి పెట్టడం కూడా మంచిది కాదు ఇలా పాడైపోయిన ఆహార పదార్థాలను తీసుకోవడం వలన ఆరోగ్యం పాడవుతుంది.
అదేవిధంగా అల్యూమినియం ఫాయిల్ లో ఆహార పదార్థాలను ఎక్కువసార్లు తీసుకువెళ్లడం వలన రోగనిరోధక శక్తి పడిపోతుంది దీంతో అనారోగ్య సమస్యలని ఎదుర్కొనే బాడీ పవర్ తగ్గుతుంది కాబట్టి ఈ అలవాటు ఉంటే మానుకోండి. స్టీల్ బాక్స్ వంటి వాటిలో ప్యాక్ చేసుకోవడం మంచిది ప్లాస్టిక్ డబ్బాలని కూడా వాడకండి. ఈ చిట్కాలని పాటిస్తే ఆరోగ్యం బాగుంటుంది అల్యూమినియం ఫాయిల్ ని కనుక ఉపయోగించినట్లయితే ఆరోగ్యం పాడవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version