క్రెడిట్ కార్డు వాడుతున్నారా..? అయితే ఇలా జరగొచ్చు జాగ్రత్త..!

-

క్రెడిట్ కార్డుని ఉపయోగిస్తున్నారా..? అయితే ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. క్రెడిట్ కార్డు ని ఉపయోగించేటప్పుడు కాస్త తప్పులు జరగకుండా చూసుకోవాలి. లేదు అంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ముఖ్యంగా క్రెడిట్ కార్డు బిల్లు కట్టకపోతే సమస్యని ఎదుర్కోవాలి. ఒకవేళ కనుక కస్టమర్స్ బిల్ కట్టకపోతే బ్యాంకులు నేరుగా డబ్బులను కట్ చేసుకుంటుంది.

ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఇలానే కస్టమర్ అకౌంట్ నుంచి రూ.56 వేలకు పైగా డబ్బులు కట్ చేసుకుంటుంది. అలానే క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించ లేదని బ్యాంక్ ఈ మేరకు కస్టమర్ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు డెబిట్ చేసుకుంది. కానీ ఇలా బ్యాంక్ డబ్బులని కట్ చేసుకోవడం అనేది రిజర్వ్ బ్యాంక్ కి విరుద్ధం.

అలానే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కి అయితే అసలు క్రెడిట్ కార్డు లేదు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వద్ద కూడా కార్డు అప్లికేషన్, కార్డు వివరాల్లేవు. ఒక అతను క్రెడిట్ కార్డు వలన ఇబ్బంది పడాల్సి వచ్చింది. బ్యాంక్ నుంచి ఆయనకు క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్ వచ్చేది. 2015-16లో కస్టమర్‌కు రూ.14,500 బిల్లు రాగా.. కస్టమర్ అప్పటి బ్యాంక్ చైర్మన్ ఆదిత్య పురికి మెయిల్స్ పెట్టాడు.

అప్పటికీ సమాధానం లేదు. అయితే బ్యాంక్ అధికారులు మాత్రం కాల్స్ చేసి బిల్లు కట్టాలని ఆయనని అడిగేవారు. కస్టమర్‌కు హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్ లైఫ్ పాలసీ ఉండేది. అయితే పాలసీ మెచ్యూరిటీ డబ్బులు కస్టమర్ బ్యాంక్ ఖాతాలో జమ అయ్యాక బ్యాంక్ అధికారులు ఈ డబ్బుల్లో నుంచి క్రెడిట్ కార్డు బిల్లు కింద రూ.56,763 తీసేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version