డయబెటీస్, మోషన్ ఫ్రీకి బొప్పాయి గింజల పొడి వాడుతున్నారా..? ఓసారి ఈ పాయింట్ చూడండి

-

బొప్పాయి పండు.. వేసివిలో బాగా దొరుకుతుంది. దీన్ని ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరూ. చక్కగా పండిన బొప్పాయి చూస్తేనే నోరూరుతుంది. భోజనం తర్వాత ఒక కప్పు బొప్పాయి ముక్కలు తీసుకునే అలవాటు చాలామందికి ఉంటుంది. తేలిగ్గా డైజెషన్ అవుతుంది. బొప్పాయి వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ తెలుసు.. అయితే బొప్పాయి కట్ చేసేప్పుడు బోలెడు గింజలు వస్తాయి కదా.. అవన్నీ మనం ఓపిక ఉంటే.. ఇళ్లల్లో నాటుకుంటాం.. లేదంటే.. కేరాఫ్ డస్ట్ బిన్. కానీ ఈ గింజలు ఎండపెట్టి అరకేజీ 900-1000 రూపాయిలకు అమ్ముతున్నారని మీకు తెలుసా..? ఓడియమ్మ.. మనం గింజలను పారేస్తున్నామే అనుకుంటున్నారా. కానీ ఈ గింజలు కొందరు తెలిసి తెలియక వాడేస్తున్నారు.. ఈరోజు మనం ఈ గింజలను ఎ‌వరూ వాడాలో చూద్దాం.

ఈ మధ్య మార్కెట్ లో బొప్పాయి ఎండువిత్తనాలు, పొడి లభిస్తున్నాయి. కొందరు వాడటం కూడా ప్రారంభించారు.

100 గ్రాములు బొప్పాయి గింజల్లో ఉండే పోషకాలు

శక్తి 485 కాలరీలు
కార్భోహైడ్రేట్స్ 25 గ్రాములు
ప్రొటీన్ 28 గ్రాములు
ఫ్యాట్ 31 గ్రాములు
ఫైబర్ 19 గ్రాములు

ఫైబర్ ఎక్కువగా ఉంది కాబట్టి.. మోషన్ ఫ్రీ బాగా అవుతుందని చాలామంది వాడుతున్నారు. మరికొంతమంది.. గ్లోకోజ్ కూడా బ్లడ్ లోకి త్వరగా వెళ్లకుండా..ఉంటుందని ఈ పొడిని వినియోగిస్తున్నారు. బొప్పాయి గింజలు పొడి వల్ల చెడు కొలెస్ట్రాల్ బాగా తగ్గుతుందని సైంటిఫిక్ గా ప్రూవ్ చేశారు. రోజుకు 3-5 గ్రాములు పొడి వాడితే.. కొలెస్ట్రాల్ బాగు తగ్గుతుందని 2004 వ సంవత్సరంలో యూనివర్శిటి ఆఫ్ పుత్రా- మలేషియా( university Of Putra- Malaysia) వారు నిరూపించారు.

వివాహం అయిన తర్వాత కొంతమంది.. పిల్లలు అప్పుడే వద్దనుకుంటున్నారు. దానికి అనుగుణంగా.. టాబ్లెట్స్ వాడుతుంటారు. నాచురల్గా గర్భం రాకుండా ఆపడానికి పచ్చిబొప్పాయి తింటారని అందిరికీ తెలుసు. కానీ అది తినలేరు కదా.. ఈ గింజల పొడి కూడా గర్భం రాకుండా ఆపుతుందని కోతుల మీద పరిశోధన చేసి యూనివర్శిటీ ఆప్ జైపూర్- రాజస్థాన్( University Of Jaipur, Rajasthan- 2002) వారు నిరూపించారు. రోజుకు 30 గ్రాముల చొప్పున ఎండుగింజల పొడిని 90 రోజులు ఇచ్చే సరికి జీరో అయిపోయింది. అంటే.. సంతానం కలగడానికి యోగ్యత కంప్లీట్ గా తగ్గిపోయింది.

45రోజుల్లోనే ఒటిలిటీ తగ్గిపోయింది. నాచురల్ ఫామిలీ ప్లానింగ్ లా ఇది ఉపయోగపడుతుందని నిరూపించారు.. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. ఎప్పుడైతే.. ఈ పొడి వాడటం ఆపేస్తారో 45 రోజుల్లోనే.. స్పామ్ కౌంట్, ఒటిలీట్ నార్మల్ అయిందని పేర్కొన్నారు. మీ అందరికే ఇప్పటికే ఈ డౌట్ వచ్చి ఉంటుంది.. అరే మొత్తం సున్నా అయిపోతే ఎట్లా.. ఇక పిల్లలు పుట్టే యోగ్యత ఉండదుగా అని..దాని మీద భయం లేకుండా.. ఈ టెస్ట్ కూడా చేశారు.

సో ఆపేసిన 45 రోజుల్లో అంతా సెట్ అయింది. గర్భనిరోధక మాత్రల వల్ల చాలా దుష్ప్రభావాలు ఉంటున్నాయి. మొత్తానికి పిల్లలు పుట్టడానికి ప్రాబ్లమ్ అవుతుంది. కాబట్టి..ఎవరైతే పిల్లలను అప్పుడే వద్దనుకుంటున్నారో.. అలాంటి వారు ఈ పొడిని వాడొచ్చు అంటున్నారు. ఇంట్రస్ట్ ఉంటే సైంటిఫిక్ గా నిరూపించారు కాబట్టి.. వాడుకోవచ్చు.

ఆడవారు కూడా వాడితే.. ఏం అవుతుందని ఎలుకల మీద 2021వ సంవత్సరంలో కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఈడీవో యూనివర్శిటీ- నైజీరియా ( College Of Medical Sciences, EDO university – Nigeria)వారు పరిశోధన చేశారు. ఎలుకలుకు ఈ బొప్పాయి గింజల పొడి ఇచ్చేసరికి 21 రోజుల్లోనే.. ఎగ్స్ ఫర్టిలిటీ కాకుండా ఆపేస్తున్నాయి, ప్రొజెస్ట్రాల్ లెవల్స్( Progesterone levels) ను తగ్గించి గర్భం రాకుండా చేస్తుందట. మళ్లీ.. పొడి వాడటం ఆపేస్తే.. నార్మల్ గానే.. ఉంటుందని కూడా తేల్చారు.

బొప్పాయి గింజల పొడిని తెలిసోతెలియక చాలా మంది మోషన్ ఫ్రీ అవతుందని, డయబెటీస్ కంట్రోల్లో ఉంటుందని.. పిల్లలు కావాల్సిన వారు కూడా వాడుతుంటారు. కాబట్టి.. ముందే చెప్తే..జాగ్రత్తపడతారని ఈ ఆర్టికల్ అందించడం జరిగింది.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version