ఐపీఎల్ 2022 చెన్నైకి అస్సలు అచ్చిరావడంలేదు. నిన్న జరిగిన మ్యాచ్‌లోనూ పరాజయం పొంది.. మూడో ఓటమిని ఖాతాలో వేసుకుంది. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 54 పరుగుల తేడాతో ఓటమి పాలైంది చెన్నై సూపర్ కింగ్స్. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్… లివింగ్ స్టోన్ చెలరేగి ఆడటంతో.. 180 పరుగులు చేసింది.
అనంతరం 181 పరుగల భారీ లక్ష్యాన్ని ఛేదించే నేపథ్యంలో.. చెన్నై సూపర్ కింగ్స్ మరో 2 ఓవర్లు మిగిలి ఉండగానే.. 126 పరుగులకే ఆలౌట్ అయి.. పరాజయాన్ని చవి చూసింది. శివమ్ దూబే ఒక్కడే పంజాబ్ బౌలర్లను ఎదురొడ్డి నిలిచాడు.
30 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 57 పరుగులు చేశాడు. అలాగే.. మహేంద్ర సింగ్ ధోని 23 పరుగులు చేశారు. మొయిన్ అలీ, కెప్టెన్ జడేజా, బ్రావో డకౌట్ అయ్యారు. పంజాబ్ బౌలర్లలో రాహుల్ చాహర్ మూడు వికెట్ల పడగొట్టగా… వైభవ్ అరోరా, లివింగస్టోన్ రెండేసి వికెట్లు, రబడ, అర్షదీప్, ఓడియన్ స్మిత్ తలోవికెట్ తీశారు.