మనం ఒకసారి ఉపయోగించిన నూనె ని మళ్ళీ వంటల్లో వాడుతూ ఉంటాము. డీప్ ఫ్రై చేసేటప్పుడు ఇలా చేస్తుంటాం. బజ్జీలు, పకోడీలు లేదంటే పూరీలు ఇటువంటివి ఏమైనా చేసినప్పుడు ఆ నూనె మిగిలిపోయింది అని మనం కూరల్లో వాడడం వంటివి చేస్తూ ఉంటాము. అయితే పదే పదే ఇలా చేయడం వలన కొన్ని రకాల సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరి ఒకసారి ఉపయోగించిన నూనె ని మళ్ళీ మళ్ళీ ఉపయోగిస్తే ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
గుండె జబ్బులు:
ఒకసారి ఉపయోగించిన నూనెను మళ్ళీ మళ్ళీ ఉపయోగించడం వలన హృదయ సంబంధిత సమస్యలు వస్తాయి. కాబట్టి పదేపదే మళ్లీ ఆ నూనెను ఉపయోగించకండి.
ఉదరకోశ సమస్యలు:
ఒకసారి వాడిన నూనెను మళ్ళీ మళ్ళీ ఉపయోగించడం వలన ఉదరకోశ సమస్యలు కూడా వస్తాయి.
అన్నవాహిక క్యాన్సర్లు:
మళ్లీ మళ్లీ అదే నూనె ని ఉపయోగించడం వలన అన్నవాహిక క్యాన్సర్లు కూడా వచ్చే ప్రమాదం ఉంది.
చెడు కొలెస్ట్రాల్:
పైగా ఒకసారి నూనెను ఉపయోగించినట్లయితే అందులోని పోషక పదార్థాలు మొత్తం మనం తీసుకుంటాము. నూనెను మళ్ళీ వేడి చేస్తే నూనె చెడు కొలెస్ట్రాల కింద మారిపోతుంది. దీనితో గుండె సమస్యలు ముప్పు పెరుగుతుంది.
పాయిజన్ గా మారుతుంది:
ఒకసారి వాడిన నూనెను మళ్ళీ మళ్ళీ ఉపయోగించడం వలన అది ఫుడ్ పాయిజన్ కింద మారుతుంది ఇలా కడుపులో నొప్పి, కడుపులో మంట వంటివి కలుగుతాయి కాబట్టి అనవసరంగా ఇటువంటి తప్పులు చేసుకుని అనారోగ్య సమస్యల బారిన పడకండి.