మళ్లీ తెలంగాణ గద్దె టీఆర్‌ఎస్‌కే సొంతం : కేటీఆర్‌

-

మళ్లీ తెలంగాణ గద్దె టీఆర్‌ఎస్‌కే సొంతం అన్నారు మంత్రి కేటీఆర్‌. వరుసగా మూడోసారి తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలను చేపడతారని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి గత ఎనిమిదేళ్లుగా కేసీఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ధిపథంలో దూసుకుపోతోందని మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి అందుతున్నాయని తెలిపారు మంత్రి కేటీఆర్‌. కేసీఆర్ కిట్, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి తదితర పథకాలతో లక్షల మందికి ప్రభుత్వం అండగా ఉందని చెప్పారు మంత్రి కేటీఆర్‌.

రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో యావత్ దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని కేటీఆర్ అన్నారు. వ్యవసాయం, ఐటీ, పర్యావరణం, పరిశ్రమలు, పట్టణాభివృద్ది తదితర అంశాలతో సమతుల్యమైన కొత్త ఇంటెగ్రేటెడ్ హోలిస్టిక్ మోడల్ ను దేశం ముందు ఉంచామని తెలిపారు మంత్రి కేటీఆర్‌. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కొందరు చేస్తున్న కుట్రలు ఫలించవని చెప్పారు. ఎవరు ఎన్ని కుట్రలకు పాల్పడినా టీఆర్ఎస్ గెలుపును అడ్డుకోలేరని అన్నారు. మరోవైపు, జగిత్యాలలో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగసభను నిర్వహిస్తోంది. ఈ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు మంత్రి కేటీఆర్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version