డబ్బుల పంపకాల్లో గొడవ… ఎమ్మార్వో ముందే విఆర్వో చెవి కొరికిన మరో విఆర్వో…!

-

అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ హత్య తర్వాత అవినీతి అధికారుల వ్యవహారాలు రోజుకి ఒకటి వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా రెవెన్యూ ఉద్యోగుల అవినీతి వ్యవహారాలు బయటపడుతున్నాయి. చిన్న పని చెయ్యాలన్నా సరే వారు ప్రజలను వేధిస్తున్న తీరుపై ఎన్ని విమర్శలు వస్తున్నా సరే వారిలో మాత్రం ఏ మార్పు రావడం లేదు. కొంత మంది ఏ స్థాయిలో అవినీతి చేసారో ఏమో గాని, తమ వద్దకు పెట్రోల్ బాటిల్ రాకుండా జాగ్రత్తలు పడుతున్నారు. దీనితో అవినీతి అధికారులను… అవినీతి నిరోధక శాఖ… పక్కా ఆధారాలతో పట్టుకుంటుంది.

తహసీల్దార్ హత్య తర్వాత ప్రజల్లో రెవెన్యూ ఉద్యోగులపై వచ్చిన ఆరోపణల దెబ్బకు అవినీతి నిరోధక శాఖ వారి మీద ఎక్కువ దృష్టి సారించింది. అవినీతి చేస్తున్నారనే అనుమానం ఉంటె చాలు అధికారుల బండారం బయటపెట్టే వరకు వదిలిపెట్టడం లేదు. ముఖ్యంగా రైతులను వేధించే అధికారుల మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇది పక్కన పెడితే తాజాగా ఒక పరిణామం జరిగింది… అవినీతి చేసిన అధికారులు డబ్బుల పంపకాల్లో గొడవలు అయి ఒకరి మీద ఒకరు దాడి చేసుకునే వరకు పరిస్థితి వెళ్ళింది. కర్నూలు జిల్లాలో ఇద్దరు వీఆర్వోతో ఎమ్మార్వో ముందే ఒకరిని ఒకరు కొట్టుకున్నారు.

సుంకేసుల వీఆర్వో వేణుగోపాల్‌రెడ్డి, జోహారాపురం వీఆర్వో కృష్ణదేవరాయ మధ్య డబ్బుల విషయంలో చిన్న వివాదం తలెత్తింది. ఆ తర్వాత అది చినికి చినికి గాలి వానగా మారింది. ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణలకు దిగారు. నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయి నుంచి… ఈ గొడవలో… తనను డబ్బుకోసం వేధిస్తున్నారు అంటూ ఆరోపించి వీఆర్వో కృష్ణదేవరాయ… మరో వీఆర్వో వేణుగోపాల్‌రెడ్డి కొరకడంతో… అక్కడే ఉన్న ఎమ్మార్వో జోక్యం చేసుకుని స్థానికులు, ఇతర ఉద్యోగుల సహాయంతో వారి మధ్య రాజీ కుదిర్చారు… ఇలా సొమ్ము కోసం ఇద్దరు అధికారులు… కర్నూలు నగరంలోని ఎమ్మార్వో కార్యాలయంలో కొట్టుకోవడంతో అధికారులు, అక్కడ ఉన్న ప్రజలు షాక్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version