బాపట్ల బీచ్ లో చంద్రబాబు సైకత కళాకృతి

-

టీడీపీ అధినేత చంద్రబాబును స్కిల్ కేసులో అరెస్ట్ చేయడంపై నిరసన తెలిపేందుకు, టీడీపీ బాపట్ల ఇన్చార్జి వేగేశ్న కళారూపాన్ని ఎంచుకున్నారు. చంద్రబాబుకు సంఘీభావం తెలుపుతూ బాపట్ల సముద్రతీరంలో వేగేశ్న నరేంద్ర వర్మ బీచ్ ఆర్ట్ వేయించారు. సైకత శిల్పి బాలాజీ వరప్రసాద్ చంద్రబాబు ముఖాకృతిని రూపొందించారు. బాబుతోనే మేం, చంద్రబాబుకు న్యాయం జరగాలి అనే నినాదాలను తన బీచ్ ఆర్ట్ లోపొందుపరిచారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్, ఐటీడీపీ కార్యకర్తలు, బాపట్ల నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు చంద్రబాబు అరెస్ట్ అక్రమం అని ఎలుగెత్తారు.

ఇది ఇలా ఉంటె, చంద్రబాబునాయుణ్ని ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తమ కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై తీర్పును ఏసీబీ కోర్టు రేపటికి వాయిదా వేసింది. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు తీర్పు ఇవ్వబోతున్నట్లు తెలిపింది. చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ హైకోర్టులో ఉండటతో దీన్ని వాయిదా వేశారు. ఒకవేళ హైకోర్టులో క్వాష్ పిటిషన్ లిస్టయితే తీర్పును వాయిదా వేస్తామని, లిస్ట్ కాకపోతే తీర్పు వెలువరిస్తామని న్యాయమూర్తి వెల్లడించారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version