రేవంత్ ను 300 కి మీ లోతుకు తొక్కుతాం : జీవన్ రెడ్డి

-

కేసీఆర్, కేటీఆర్ ఆదేశిస్తే రేవంత్ ను 300 కిలో మీటర్ల లోతుకు తొక్కుతామని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి లఫంగా మాటలు మాట్లాడుతున్నారని… బీజేపీ ఎంపీ అరవింద్ లంగా మాటలు మాట్లాడుతున్నారని ఫైర్‌ అయ్యారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహి..నిన్న సభలో అన్ని అబద్దాలు చెప్పారని మండిపడ్డారు.

లక్షా 26వేల ఉద్యోగాలు ఇచ్చామని.. మహిళా రుణాలకు 200కోట్ల వడ్డీ చెల్లించామని చురకలు అంటించారు. రేవంత్ నీకు టీపీసీసీ ఉద్యోగం రావడానికి కారణం కేసీఆర్.. తెలంగాణ తేవడమేనన్నారు. ఆకునూరి మురళి ఎక్కడ ఎవరికి అడ్వైసర్ గా ఉన్నారో రేవంత్ చెప్పాలని పేర్కొన్నారు. తెలంగాణ ఇచ్చామని చెప్పుకున్నా కాంగ్రెస్ ను ప్రజలు 200 కిలోమీటర్ల లోతులో పాతరపెట్టారని ఎద్దేవా చేశారు. ఇంకా సోనియా రాజ్యం ఎలా వస్తుందని.. 2009లో కొడంగల్ లో పొత్తు వల్ల రేవంత్ గెలిచారని చురకలు అంటించారు. తెలంగాణ రాష్ట్రం లో అభివృద్ధి చేయడమే టీఆర్‌ఎస్‌ పార్టీ ధ్యేయమన్నారు ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version