రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామిని రెండు వారాల పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. నిన్న రాయగడ్ పోలీసులు ముంబై పోలీసులతో కలిసి గోస్వామిని అతని నివాసంలో నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేశారు. 2018 లో 53 ఏళ్ల ఇంటీరియర్ డిజైనర్, అతని తల్లి ఆత్మహత్యకు పాల్పడిన కారణంగా దానికి ఆర్నాబ్ కారణం అని పేర్కొంటూ అతన్ని అరెస్టు చేశారు. ఇక నా నివాసంపై పోలీసులు దాడి చేయడంతో పాటు తమ మీదతన అత్తగారిని, తన మామగారిని, తన కొడుకు మీద కూడా దాడి చేశారని అర్నాబ్ ఆరోపించారు.
ఇక ఆర్నాబ్ అరెస్టు అయిన వెంటనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయన అరెస్టును ఖండించారు మరియు దీనిని రాష్ట్ర అధికారాన్ని “దుర్వినియోగం” చేయడంగా అభివర్ణించారు, ఇది “అత్యవసర పరిస్థితిని గుర్తు చేస్తుంది” అని ఆయన అన్నారు. ఇక పాల్ఘర్ మాబ్ లిన్చింగ్ సంఘటన మరియు బాంద్రా రైల్వే స్టేషన్ క్రౌడింగ్ సంఘటనలకు సంబంధించి వరుసగా ఎన్ఎమ్ జోషి మార్గ్ పోలీస్ స్టేషన్ మరియు పైథోనీ పోలీస్ స్టేషన్లో గోస్వామి మీద మరి కొన్ని కేసులు కూడా నమోదయ్యాయి.