బీఆర్ఎస్ కు పోయింది అధికారం మాత్రమే.. పోరాటం కాదు : కేటీఆర్

-

బీఆర్ఎస్ కు పోయింది అధికారం మాత్రమే.. పోరాటం కాదు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తాజాగా తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. కరోనా సమయంలో కేసీఆర్ స్పీచ్ కోసం తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేవారు. కరోనా సమయంలో కార్మికులను అన్ని రంగాల్లో ఆదుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అని గుర్తు చేశారు. భారతదేశంలో సఫాయి కార్మికుల కోసం కేసీఆర్ చేసిన కృషి ఏ రాష్ట్ర సీఎం చేయలేదన్నారు. 

 

కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే కేసీఆర్ బీడీ కార్మికులందరికీ ఇండ్లు మంజూరు చేశారు. కష్టకాలం వచ్చినప్పుడే నాయకత్వం యొక్క విలువ తెలుస్తుంది అన్నారు. రూ.9000 ఉన్న జీతాన్ని రూ.27వేలు చేశారని హోంగార్డుల వేతనాలు పెంచారని హోంగార్డు గుర్తుకు చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే అత్యధిక పే స్కేలు మీకే ఇస్తానని ఉద్యమంలో చెప్పి.. అమలు చేసిన సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు పీఆర్సీ కల్పించారని గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news