ఆరోగ్య శ్రీ బిల్లులు పెండింగ్.. జగన్ ఆగ్రహం

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  ఆరోగ్య శ్రీ బిల్లులన్నీ పెండింగ్ లో పెట్టారని మాజీ సీఎం జగన్ కూటమి ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి అధికారంలోకి రాగానే వాలంటీర్ల ఉద్యోగం పోయింది. సచివాలయ వ్యవస్థ అగమ్య ఘోచరంగా తయారైంది. రూ.2800 కోట్ల విద్యాదీవెన బకాయిలు, రూ.1100 కోట్ల వసతి దీవెన బకాయిలు పెండింగ్ లో పెట్టడంతో విద్యార్థులు చదువులకు దూరం అవుతున్నారని తెలిపారు.

Jagan

ఆరోగ్య శ్రీ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు చేయడం లేదు. 108, 104 పడకేశాయని ఆరోపించారు. రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో బాధకరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయని  తెలిపారు. హామీల అమలు లేకపోగా.. స్కామ్ పాలన నడుస్తోందన్నారు. ” నా పాదయాత్రలో కష్టాలను చూశాను. అందుకు తగ్గట్టు గత ఐదేళ్ల పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. ప్రతీ ఇంటికీ మంచి చేశాం. ఇప్పుడు ఆ అడుగులు వెనక్కి ఎలా వెళ్తున్నాయో చూస్తున్నాం. కూటమి పాలనలో తిరోగమనంలో రాష్ట్రం ఉంది” అని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version