రాష్ట్రంలో సంక్రాంతి నాటికి గుంతలు లేని రోడ్లు : బీసీ జనార్థన్ రెడ్డి

-

గత ప్రభుత్వ హయాంలో ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ నిర్వీర్యం కావడం జరిగింది. ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా గుంతలు పడ్డ రోడ్లు బాగుపరచడానికి మొదటి సారి 861 కోట్ల రూపాయలు చేశారు అని మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి తెలిపారు. వాటి పనులు రాష్ట్రవ్యాప్తంగా ముమ్మురంగా చురుగ్గా జరుగుతున్నాయని గర్వంగా చెప్పగలను. 53 జీవో 349 జీవో ప్రకారం కడప జిల్లా లో మొదటి దశ 269 పనులకు 33.58 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ రహదారులు కూడా ముమ్మరంగా పనులు మొదలుపెట్టి కన్వర్షన్ కింద తీసుకు రావడం జరిగింది. గతంలో స్టేట్ హైవే,నాబార్డ్,ఎన్డీబీ క్రింద కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదు, దాంతో వారు పనులు చేయలేదు.

ఇప్పుడు ఎన్డీబీ కి 240 కోట్లు చెల్లించగా, 5వేల కోట్ల పనులు మొదలుపెట్టినారు. గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్లకు బిల్లును చెల్లించక పోవడంతో వారు ఆత్మహత్య చేసుకున్నారు. అలాగే రోడ్లు బాగా లేకపోవడం వలన పరిశ్రమలు తరలిపోవడం, టూరిజం డెవలప్ కాకపోవడం జరిగింది. రాష్ట్రంలో సంక్రాంతి నాటికి గుంతలు లేని రోడ్లను చూడాలన్నదే ధ్యేయం. దీనిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి మూడు రోజుల కు ఒక్కసారి సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు అని జనార్థన్ రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version