పోలీసుల అదుపులో ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి..

-

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు, కార్మికనేతలు ‘చలో ట్యాంక్‌బండ్‌’కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి పోలీసుల అనుమతి లభించలేదు.ఈ దీక్ష కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ట్యాంక్ బండ్ పైకి పోలీసులు భారీగా మోహరించారు. అలాగే శుక్రవారం నుంచే కార్మికులు, కార్మిక నేతలను ఎక్కడికక్కడే అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్లకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిని గోల్కొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అశ్వత్థామతో పాటు పలువురు జేఏసీ నేతలను సైతం పీఎస్‌కు తరలించారు. కాగా హైదరాబాద్‌లో ఇప్పటి వరకూ 170 మందిని అరెస్ట్‌ చేసినట్లు సీపీ అంజనీకుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. అయితే ఆర్టీసీ కార్మికుల స‌మ్మెలో భాగంగా నిజామాబాద్ జిల్లాలో కార్మికులు, జేఏసీ నేత‌లు నిరాహారదీక్ష చేస్తున్నారు. వీరికి మ‌ద్ద‌తుగా వివిధ పార్టీల నాయ‌కులు సంఘీభావం తెలిపారు. ఇక ఆర్టీసీ కార్మికుల స‌మ్మె రోజు రోజుకు ఉధృతం అవుతుంది. గ‌త 35 రోజులుగా ఆర్టీసీ కార్మికులు వివిద రూపాల్లో వారు వారి నిర‌స‌నల‌ను తెలుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news