ఆర్టికల్ 370,మహిళా బిల్లు,ట్రిపుల్ తలాక్…. 17వ లోక్‌సభ గొప్ప సంస్కరణలు…..

-

ప్రధాని నరేంద్రమోడీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.పార్లమెంట్‌లో ఆయన ప్రసంగిస్తూ….17వ లోక్‌సభలో కొన్ని తరాలుగా ఎదురుచూసిన విజయాలను బీజేపీ అధికారంలోకి వచ్చాక సాధించామని ప్రధాని అన్నారు.17వ లోక్‌సభ చివరి రోజు చివరి సెషన్ ఆయన సభను ఉద్దేశించి మాట్లాడుతూ … గత ఐదు సంవత్సరాలలో దేశంలో గేమ్ ఛేంజింగ్ సంస్కరణల్ని తెచ్చామని అన్నారు.

 

అనేక తరాలుగా ఏదురుచూస్తున్న ఆర్టికల్ 370ని ఈ లోక్‌సభలో రద్దు చేయడమే కాకుండా జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని అణిచివేసినట్లు ప్రధాని తెలిపారు. రాబోయే 25 సంవత్సరాలు మన దేశానికి చాలా ముఖ్యమైనవని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ట్రిపుల్ తలాక్,ఆర్టికల్ 370 రద్దు, ప్రతిష్టాత్మక జీ20 సమావేశాల నిర్వహణ మొదలైన అనేక సమస్యలను ఉటంకిస్తూ.. దేశం మార్పు దిశగా పయణిస్తోందని ప్రధాని అన్నారు. ఉగ్రవాదంతో పోరాడేందుకు కఠిన చట్టాలు,డేటా ప్రొటెక్షన్ బిల్లు, వాడుకలోని అనేక చట్టాల తొలగింపు, మహిళా రిజర్వేషన్ బిల్లులను ప్రభుత్వం సాధించిన విజయాలుగా ఆయన అన్నారు. ట్రాన్స్‌జెండర్లతో సహా అట్టడుగున ఉన్న వ్యక్తలపై దృష్టిసారరిచి ,వారికి ప్రభుత్వం పద్మ అవార్డులను ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. గత ఐదేళ్లలో ‘శతాబ్ధపు అతిపెద్ద సంక్షోభం కోవిడ్ మహమ్మారిని చూశామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news