నితేశ్‌ తివారీ రామాయణంలో రకుల్ ప్రీత్‌సింగ్!

-

బాలీవుడ్‌లో డైరెక్టర్ నితేశ్ కుమార్‌ రామాయణం సినిమా తెరకెక్కిస్తున్నారని గత కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్‌ ప్రొడ్యూసర్లతో కలిసి నిర్మాత అల్లు అరవింద్‌ రామాయణాన్ని తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలో రాముడిగా బాలీవుడ్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ దాదాపుగా ఖాయమవ్వగా.. సీత పాత్ర కోసం సాయిపల్లవి, జాన్వీకపూర్‌ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇక మరో ముఖ్యమైన శూర్పణఖ పాత్రలో మన టాలీవుడ్ బ్యూటీ రకుల్‌ ప్రీత్‌సింగ్‌ను ఓకే చేసినట్లు నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ పాత్ర కోసం మూవీ యూనిట్‌ ఆమెను సంప్రదించగా వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. త్వరలోనే లుక్‌ టెస్ట్‌ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రావణుడిగా యశ్‌, విభీషణుడిగా విజయ్‌ సేతుపతి, హనుమంతుడిగా బాబీ డియోల్ కనిపించనున్నట్లు సమాచారం. మరోవైపు రకుల్ తన బాయ్‌ఫ్రెండ్ జాకీ భగ్నానీలో ఈ నెలలో వివాహమాడుతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే పెళ్లి తర్వాత రకుల్ నటించబోయే తొలి సినిమా రామాయణం అవుతుందని టాక్.

Read more RELATED
Recommended to you

Latest news