మార్కెట్ లోకి కృత్తిమ గుండె..

-

వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. తాము అభివృద్ధి చేసిన కృత్రిమ గుండె ఈ ఏడాది మార్కెట్లోకి తీసుకు వస్తున్నామని ఫ్రాన్స్ కంపెనీ ప్రకటించింది. మన మొబైల్స్ లో వాడే లిథియం అయాన్ బ్యాటరీ తో ఈ గుండె నడవనుందని కంపెనీ ప్రకటించింది. రక్త ప్రసరణ సాఫీగా జరిగేలాగా ఇందులో సెన్సార్లు, హైడ్రాలిక్ సిస్టం ఉంటుందని సదరు కంపెనీ పేర్కొంది. ఇక తమ ఆర్టిఫిషియల్ గుండె ద్వారా ఎంతో మంది గుండె రోగులకు ఊరట కలిగిస్తుందని కంపెనీ చెప్పుకొచ్చింది.

అంతేకాక ఈ కృత్రిమ గుండె దీర్ఘకాలిక గుండె రోగాలు ఉన్న వారికి కూడా ఎంతో ఊరట కలిగిస్తుందని అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతానికి గుండె ఫెయిల్ అయిన వారికి అవయవ దానం ద్వారా మాత్రమే గుండె మారుస్తున్నారు. ఈ కృత్రిమ గుండె అందుబాటులోకి వచ్చి సక్సెస్ సాధిస్తే చాలా మంది గుండె రోగులకు ఉపయోగపడుతుందనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version