వికారాబాద్ జిల్లాలో కలకలం.. వందల సంఖ్యలో కోళ్లు, కాకులు మృతి ?

-

ప్రజలను బర్డ్ ఫ్లూ టెన్షన్ ఇంకా వీడడం లేదు. మరీ ముఖ్యంగా తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ ఎత్తున కోళ్లు మృత్యువాత పడడం టెన్షన్ రేకెత్తిస్తోంది. తాజాగా వికారాబాద్ జిల్లాలో ఈ బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. ఓకే ఊరిలో వందల సంఖ్యలో కోళ్లు, కాకులు, పిట్టలు మృత్యువాత పడడం ఆ గ్రామ వాసులు అందర్నీ టెన్షన్ పెడుతోంది. ధారూర్ మండలం దోర్నాల్ గ్రామంలో నిన్నటి నుంచి వందల సంఖ్యలో ఇలా కోళ్లు, కాకులు, పిట్టలు వరుసగా మృత్యువాత పడుతున్నాయి అని తెలుస్తోంది.

స్థానికుల నుంచి సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన గ్రామానికి చేరుకున్నారు. కొన్ని శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కి పంపినట్లు సమాచారం అందుతోంది. అయితే నిన్నటి నుంచి ఈ రోజుకి మరో మండలానికి ఈ ఈ వింత రోగం పాకినట్లుగా సమాచారం అందుతోంది. దీంతో అక్కడి స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ల్యాబ్ లో టెస్ట్ చేశాక అసలు దీనికి కారణం ఏమిటి అనేది అధికారులు చెప్పనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version