RIP Arun Jaitley : అరుణ్ జైట్లీ రాజ‌కీయ ప్ర‌స్థానం.. విద్యార్థి దశ నుంచే నాయకుడుగా..!

-

కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ శ‌నివారం అనారోగ్యంతో మృతిచెందారు. విద్యార్థి నాయకుడిగా, పార్టీ నేతగా, కేంద్రమంత్రిగా.. అరుణ్ జైట్లీ చేసిన సేవలు చిరస్మరణీయంగా గుర్తుండిపోతాయి. బీజేపీలో ఆయన వేసిన ముద్ర న్నటికీ చెరగనిదిగా ఉంటుంది. 1952.. డిసెంబర్ 28న ఢిల్లీలో జన్మించారు. తండ్రి బాట‌లో న్యాయ‌వాదిగా మారారు.


ఆయ‌న‌ ఢిల్లీ యూనివర్సిటీ నుంచి అరుణ్ జైట్లీ న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. విద్యార్థి దశలోనే ఆయన యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ నాయకుడిగా ఎన్నికయ్యారు. ఏబీవీపీలో చేరారు. క్యాంపస్ లో ఏబీవీపీ ప్రెసిడెంట్ గా పనిచేశారు. తర్వాతి కాలంలో.. ఢిల్లీ ఏబీవీపీ అధ్యక్షుడిగా పనిచేశారు. కొంతకాలానికే.. ఢిల్లీ బీజేపీ యువమోర్చా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అలా అంచెలంచెలుగా ఆయ‌న ఎదిగారు.

ఎమర్జెన్సీ టైంలో అరుణ్ జైట్లీ 19 నెలలు జైలుకు వెళ్లారు. జైలు నుంచి విడుదలయ్యాక.. జనసంఘ్ పార్టీలో చేరారు. సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా పనిచేసిన ఆయ‌న మాజీ ప్ర‌ధాన‌మంత్రి పీవీసింగ్ టైంలో సొలిసిటర్ జనరల్ గా పనిచేశారు. 1991 నుంచి అరుణ్ జైట్లీ బీజేపీ కార్యవర్గంలో పనిచేశారు. వాజ్‌పేయి, మోడీ కేబినెట్లో ఆయ‌న మంత్రిగా ప‌నిచేశారు.

2009 నుంచి 2014 వరకు.. రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు జైట్లీ. 2014లో తొలిసారి అమృత్ సర్ నుంచి పోటీకి దిగారు. కాంగ్రెస్ అభ్యర్థి.. అమరీందర్ సింగ్ చేతిలో ఓటమిపాలయ్యారు. 2014లో బీజేపీ అఖండ మెజారిటీతో గెలువగా మోడీ ఆయ‌న్ను ఆర్థిక‌మంత్రిని చేసి రాజ్య‌స‌భ సభ్యుడిగా చేశారు.
2019 ఎన్నికల్లో.. ఆరోగ్య కారణాల వల్ల.. అరుణ్ జైట్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. తర్వాత…మోడీ కేబినెట్ లో నూ చేరలేదు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version