పెళ్లి చేసుకుంటున్నారా ? అయితే బంగారం ఫ్రీ !

-

ఇది ఏంటి రా నాయనా, పెళ్లి చేసుకుంటే బంగారం ఫ్రీగా ఇస్తారా ? వెంటనే చేసుకుందాం అనుకుంటున్నారా ? అయితే కాస్త ఆగండి ఈ మాట నిజమే కానీ అందరికీ ఇవ్వరండోయ్… కేవలం అస్సాం ప్రజలకు మాత్రమే అక్కడి ప్రభుత్వం ఈ ఆఫర్ ఇచ్చింది. అరుంధతి గోల్డ్ స్కీం పేరుతో ప్రవేశపెట్టిన ఈ పథకం ప్రకారం అస్సాంలో పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలకు అక్కడి ప్రభుత్వం 10 గ్రాముల బంగారాన్ని ఉచితంగా అందిస్తోంది.

నిజానికి ఇది ఏమీ అంత వింత ఏం కాదు ఎందుకంటే దాదాపు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పెళ్లి చేసుకుంటున్న పేద కుటుంబాల వారికి నగదు సహాయం అందిస్తున్నారు. తెలంగాణలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలు ఉండగా ఆంధ్రప్రదేశ్ లో చంద్రన్న పెళ్లి కానుక పథకం ఉంది. అయితే అస్సాం ప్రభుత్వం మాత్రం పెళ్లి చేసుకునే అమ్మాయిలు 10 గ్రాముల బంగారం ఉచితంగా ఇస్తోంది. ఈ పథకం కింద బంగారం ఉచితంగా పొందాలంటే అమ్మాయికి 18 ఏళ్లు నిండి ఉండాలి. అలానే ఈ పెళ్ళిని రిజిస్టర్ చేయించి ఉండాలి. అంతేకాక సదరు అమ్మాయి కుటుంబం ఈ వార్షిక ఆదాయం 5 లక్షల లోపే ఉండాలి. అలానే ప్రభుత్వానికి సంబంధించి లీగల్గా జరిగితేనే ఈ బంగారం పొందేందుకు అర్హులవుతారు.

Read more RELATED
Recommended to you

Latest news