Shahrukh Khan: ఖైదీ నంబర్ N956కి షారుక్ ఖాన్ మ‌నీ ఆర్డ‌ర్! ఆ ఖైదీ ఎవ‌రు? ఎంత డ‌బ్బు పంపాడో తెలుసా?

Shahrukh Khan: డ్రగ్స్ కేసు బాలీవుడ్ లో క‌ల‌క‌లం రేపుతుంది. ఈ కేసులో బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ తనయుడు ఆర్య‌న్ ఖాన్ కు ఉచ్చు బిగుసుకుంది. ఇప్పటికే మూడు సార్లు ముంబై కోర్టు బెయిల్‌ విచారించ‌డం హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ కేసును ఎన్సీబీ అధికారులు చాలా సీరియ‌స్ గా తీసుకున్నారు. ఎలాంటి.. ప్ర‌లోభాలకు లేకుండా విచారణ చేస్తున్నారు.

ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్యన్‌ ప్రస్తుతం ముంబయిలో అర్థర్‌రోడ్ జైళ్ల‌లో ఉన్నాడు. కాగా ఆర్యన్ ఖాన్‌కు ఖైదీ నంబర్ N956 కేటాయించినట్లు తెలుస్తోంది. అయితే..ఆర్య‌న్ జైలులో క్యాంటీన్‌ ఖర్చుల కోసం షారుక్ ఖాన్ రూ .4,500 ల‌ను మనియార్డర్‌ చేశారు. అలాగే.. ఈ నేపథ్యంలో ఆర్యన్‌కు తల్లిదండ్రులతో మాట్లాడే అవకాశం కల్పించింది . ఈ నేపథ్యంలో ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా.. షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్‌తో ఆర్యన్ మాట్లాడించిన‌ట్టు జైలు సూపరింటెండెంట్‌ నితిన్ వేచల్ తెలిపారు. కరోనా పరీక్షల్లో ఆర్యన్‌తో పాటు ఆర్భాజ్‌కు నెగెటివ్‌ రావడంతో సాధారణ సెల్‌కు తరలించిన‌ట్టు తెలిపారు.

జైలు నిబంధనల ప్రకారం ఓ ఖైదీకి ఖర్చుల కోసం గరిష్టంగా 4,500 రూపాయల మనియార్డర్ చేయ‌వ‌చ్చు. ఈ నెల 3న ముంబాయి స‌ముద్రంలోని క్రూజ్‌ నౌకపై ఎన్సీబీ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో ఆర్యన్‌ ఖాన్‌, మూన్‌మూన్‌ ధామేచ, అర్బాజ్‌ మెర్చంట్‌ సహా ఎనిమిది మంది అరెస్ట్​ అయ్యారు. ఈ క్ర‌మంలో బెయిల్‌ పిటిషన్ ద‌రఖాస్తు చేసుకున్న మూడు సార్లు కోర్టులో చుక్కెదురైంది. పైగా సెలబ్రిటీల పిల్లలైన్నంత మాత్రాన బెయిల్ ఇవ్వరాదని చట్టంలో ఎక్కడ లేదని కౌంటరిచ్చారు. ఈ కేసులో తీర్పును ఈనెల 20వ తేదీ వరకు రిజర్వ్‌లో పెట్టారు.