ఫోన్ లో ఒక నెల రిచార్జ్ చేసినప్పుడు 28 రోజులకే ఎందుకొస్తుందో తెలుసా.. వెనక పెద్ద బిజినెస్ఏ ఉందట.!

-

ఈరోజల్లో ఫోన్ లేకుండా ఎవరుంటారు చెప్పండి.. ముసలోళ్ల నుంచి అందరూ వారికి తగ్గట్టుగా ఏదో ఒక ఫోన్ అయితే వాడుతున్నారు. మన జీవితంలో నిత్యఅ‌వసరం అయిపోయింది. ఫోన్ లోనే చాలా పనులు జరుగుతాయి. అయితే మీకు ఎప్పుడైనా అనిపించిందా..మనం మొబైల్ లో వన్ మంథ్ రిచార్జ్ చేస్తే 30 రోజులు రావాలి కదా 28 రోజులే ఇస్తారేంటబ్బా అని. అవును ఇంకా రిచార్జ్ గడువుకు మూడురోజుల ముందు నుంచే గుర్తుచేస్తుంటారు. ఇదో టార్చర్ మళ్లీ. ఎ‌వరికి ఫోన్ చేసిన ముందు మీ బ్యాలన్స్ గడువు ముగుస్తుంది. త్వరాగా రిచార్జ్ చేసుకోండి అంటూ. అయితే మనం ఈ 28 రోజుల కాన్సప్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఒకవేళ ఒకసారి మనం రీఛార్జ్ చేసినప్పుడు నెల మొత్తానికి రీఛార్జ్ అయితే ఒక సంవత్సరంలో పన్నెండు సార్లు మాత్రమే మనం మన ఫోన్ రీఛార్జ్ చేసుకుంటాం. అదే ఒకవేళ 28 రోజులకు అయితే ఒక సంవత్సరంలో 13 సార్లు రీఛార్జ్ చేసుకుంటాం. ఇలా ఒకమనిషి కాదు..కొన్ని కోట్లమంది చేస్తారు. దానివల్ల సిమ్ కార్డు కంపెనీలకు ఎంతలాభమో. ఒక రకంగా చెప్పాలంటే ఇది సిమ్ కార్డ్ కంపెనీల మార్కెటింగ్ స్ట్రాటజియో.

మనం ఒకసారి కాలిక్యులేటర్ ఆన్ చేసి అందులో 365ని 30తో డివైడ్ చేస్తే 12.1666667 వస్తుంది. అదే 365 ని 28 తో డివైడ్ చేస్తే 13.0357143 వస్తుంది. ఇలా మనం సంవత్సరంలో 12 నెలలు ఉన్నా కూడా 13 సార్లు రీఛార్జ్ చేస్తే ఆ కంపెనీలకి ఈ క్యాలిక్యులేషన్ లో చెప్పినట్టు లాభం వస్తుంది. ఇది కంపెనీ ల యొక్క స్ట్రాటజీ. అందుకే మనం 30 రోజులకు రీఛార్జ్ చేద్దామని అనుకున్నా కూడా 28 రోజులకు మాత్రమే రీఛార్జ్ అవుతుంది.

అయితే ఒక సిమ్ కార్డ్ కంపెనీ మాత్రమే ఇలా చేయడం మొదలు పెట్టింది. ఆ తర్వాత ఇదే పద్ధతిని అన్ని సిమ్ కార్డ్ కంపెనీలు పాటించాయి. ఇక వినియోగదారులకు కూడా 30 డేస్ రిచార్జ్ అంటే 28 డేస్ మాత్రమే వస్తుంది..ఏవో టాక్సుల వల్ల ఇలా అవుతుందని ఫిక్స్ అయిపోయారు. కానీ దాని వెనుకు ఉన్న స్ట్రాటజీ ఇది.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news