దేశాన్ని మూడు ముక్క‌లు చేసే ప‌నిలో మోదీ: అసదుద్దీన్ వ్యాఖ్య‌లు

-

ఎన్ఆర్‌సీ వ్య‌తిరేకంగా దేశమంతా అట్టుడుకుతున్న వేళ తెలంగానలోనూ ముస్లి యాక్షన్ కమిటీ నిరసనలు చేపట్టింది. తాజాగా ఎన్ఆర్‌సీ, సీఏఏ, ఎన్‌పీఆర్‌లకు మాత్రమే తాము వ్యతిరేకమని, హిందువులకు కాదని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. ముస్లిం యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ మూడింటికి వ్యతిరేకంగా నిజామాబాద్‌లో నిన్న నిర్వహించిన బహిరంగ సభలో అసదుద్దీన్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీపై నిప్పులు చెరిగారు.

భారతదేశం అన్ని మతాల సంగమమని, ఈ దేశాన్ని మోదీ మూడు ముక్కలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. తెలంగాణను సెక్యులర్‌గా ఉంచుతామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు. తన పౌరసత్వాన్ని అడిగే హక్కు మోదీకి లేదని అసద్ పేర్కొన్నారు. తాను హిందువులకు ఎంతమాత్రమూ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. బీజేపీ మతరాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. తల్లిదండ్రులు, తాత ముత్తాతల గుర్తింపు తీసుకురమ్మంటే ఎక్కడి నుంచి తీసుకొస్తామన్నారు. ఏ డిగ్రీలేని మోదీ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నారని ఆరోపించారు ఓవైసీ.

Read more RELATED
Recommended to you

Latest news