ఏపీకి భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి అనుకుని దక్షిణ అండమాన్ సముద్రంలో శుక్రవారం ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా పయనించి శనివారం ఉదయానికి వాయుగుండంగా మారింది. దీనికి అసాని అని పేరు పెట్టారు. ప్రస్తుతం విశాఖకు 1270 కిమీ… పూరీకి 1300 కిమీ. దక్షిణ ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది.
ఇది శనివారం ఉదయానికి తీవ్ర వాయుగుండగా…ఆదివారం ఉదయానికి తుఫాన్ గా మారిందని పేర్కొంది వాతావరణ శాఖ. తుఫాన్ ఈ నెల 10 వరకు వాయువ్య దిశగా పయనించి ఉత్తర కోస్తా, ఒడిశాకు దగ్గరగా వస్తుందంటున్నారు. ఈ ప్రభావంతో రాగల 24 గంటల్లోకోస్తాంధ్ర లో మోస్తారు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఈ నల 10, 11 న ఉత్తర కోస్తాలోని ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయి పేర్కొంది. ఇప్పటికే విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే.