కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే కూతురిపై కొన్ని రోజులుగా లైంగిక దాడి చేస్తున్నాడు. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఈ సంఘటన బీహార్ లోని సమస్తిపూర్ లో చోటు చేసుకుంది. ఓ తండ్రి తన 18 ఏళ్ల కూతురుపైనే కన్నేశాడు. ఆమెను భయపెట్టి కొన్ని రోజులుగా లైంగిక దాడి చేస్తున్నాడు. పశువులా మీద పడి.. కామవాంఛ తీర్చుకుంటున్నాడు.
తనను వదిలేయాలని ప్రాధేయపడుతున్నా.. ఆ నీచుడు మాత్రం కనుకరించలేదు. అయితే.. ఈ దారుణం బాధితురాలి తల్లికి, మామకు కూడా తెలుసు. అయినా వాళ్లు నోర్లు మెదపలేదు. దీంతో ఆ అమ్మాయి.. తన తండ్రి దురాఘాతాన్ని తానే బయట పెట్టాలని నిర్ణయించుకుంది.
ఇందుకోసం సీక్రెట్ కెమెరా వాడింది. తన గదిలో సీక్రెట్ కెమెరా అమర్చింది. ఈ విషయం తెలియని తండ్రి.. ఎప్పటిలాగే కూతురిపై లైంగిక దాడి చేసేందుకు వచ్చాడు. దీన్నంతా ఆమె వీడియో తీసింది. ఆ తర్వాత ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తనకు న్యాయం కావాలని వేడుకుంది. దీనిపై పోలీసులు ఇంకా స్పందించలేదు.