యాషెస్ సిరీస్ 2023 : ఆస్ట్రేలియా మహిళల ముందు భారీ లక్ష్యం 286 … !

-

ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్ మహిళల మధ్యన జరుగుతున్న యాషెస్ సిరీస్ లో ఇవాళ చివరి మ్యాచ్ జరుగుతోంది, ఇప్పటికే ఇంగ్లాండ్ యాషెస్ సిరీస్ ను ఆస్ట్రేలియాకు కోల్పోయింది. కానీ వన్ డే సిరీస్ ను గెలుచుకుని పరువును దక్కించుకోవాలని పోరాటం చేస్తోంది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ మహిళలు నిర్ణీత ఓవర్ లలో 9 వికెట్లు కోల్పోయి 285 పరుగులు చేసింది. అయితే ఈ మాత్రం స్కోర్ చేసిందంటే అద్భుతం అని చెప్పుకోవాలి, ఎందుకంటే స్వల్ప స్కోర్ కె రెండు కీలక వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన నటాలీ సీవర్ మరియు కెప్టెన్ నైట్ లు ఆచితూచి ఆడుతూ మరో వికెట్ పడకుండా స్కోర్ బోర్డు ను కదిలించారు. అలా ఆడుతూ వచ్చి జట్టుకు పోరాడగలిగే స్కోర్ ను అందించారు. ఇందులో నైట్ 67 పరుగులు చేయగా , నటాలీ సీవర్ అద్భుతంగా ఆడి వరుసగా ఈ సిరీస్ లో రెండవ సెంచరీ చేసి 129 పరుగుల వద్ద ఉండగా భారీ షాట్ కు ప్రయత్నించి అవుట్ అయింది.

 

మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో ? ఎవరికి వన్ డే సిరీస్ సొంతం అవుతుందో తెలియాలంటే ఇంకాసేపు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news