ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన మరియు బీజేపీలు కలిసి వైసీపీని ఓడించడానికి విశ్వప్రయత్న్లు చేస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా జనసేన అధినేత పవన్ కాలిన ఢిల్లీ పర్యటనలో భాగంగా వెల్లడించారు. వైసీపీకి వ్యతిరేకంగా పవన్ చేస్తున్న వ్యాఖ్యల పట్ల వైసీపీ నేత మరియు మంత్రి కొట్టు తనదైన శైలిలో స్పందించారు. ఈయన కాసేపటి క్రితమే మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రతి ఒక్క కామెంట్ వెనుకాల ఎవరు ఉన్నారో నాకు తెలుసు. వైసీపీకి మరియు సీఎం జగన్ కు వ్యతిరేకంగా ఎవరు ఎన్నో కామెంట్ లు చేసినా వచ్చే ఎన్నికల్లో గెలిచేది మేమె, రాబోయేది మా ప్రభుత్వమే అంటూ ఘంటాపధంగా చెప్పారు. పవన్ కళ్యాణ్ ను ముందుకు తోసి అతని ద్వారా అసత్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా చేస్తున్న వారి అకౌంట్ లు అన్నీ మళ్ళీ జగన్ రెండవసారి సీఎం అయ్యాక సెటిల్ చేస్తాడని మంత్రి కొట్టు నమ్మకంగా మాట్లాడారు.
మరి మంత్రి కొట్టు చెప్పినట్లు వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందా ?