ఎమ్మెల్యేలను జైపుర్‌ నుంచి జైసల్మేర్‌కు మార్చిన సీఎం అశోక్​ గహ్లోత్‌

-

రాజస్థాన్‌ రాజకీయాల్లో ఏర్పడ్డ అనిశ్చితి ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌.. తన వర్గ ఎమ్మెల్యేలను జైపుర్‌ నుంచి జైసల్మేర్‌కు తరలించారు. శాసనసభ సమావేశ తేదీని ప్రకటించిన తర్వాత ఎమ్మెల్యేల కొనుగోళ్లకు బేరసారాలు మరింతగా ఉపందుకున్నాయని ఆరోపించిన గహ్లోత్‌ ఈ మేరకు జాగ్రత్తపడ్డారు.

ashok
ashok

రాజధాని జైపుర్‌ నుంచి జైసల్మేర్‌ 550 కి.మీ దూరంలో ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలో అవతలి వర్గం వీరిని సంప్రదించే అవకాశమే ఉండదని అధికార పక్షం భావిస్తున్నట్లు సమాచారం. తొలుత రూ.25 కోట్లు ఇస్తామని బేరమాడిన వారు ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంతడిగితే అంత ఇచ్చేందుకు సిద్ధమయ్యారని పరోక్షంగా అసమ్మతి వర్గాన్ని ఉద్దేశించి గహ్లోత్‌ గురువారం ఆరోపించారు.

సచిన్‌ పైలట్‌తో పాటు మరో 18 మంది ఎమ్మెల్యేలు సొంత ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన మరుసటి రోజు నుంచి గహ్లోత్‌ వర్గం ఎమ్మెల్యేలు జైపుర్‌ శివారులోని ఫెయిర్‌మాంట్‌ హోటల్లో బస చేస్తున్నారు. దాదాపు 15 రోజుల నుంచి వారంతా అక్కడే ఉంటున్నారు. ఆగస్టు 14న అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో అప్పటి వరకు హోటల్లోనే ఉండాలని కాంగ్రెస్‌ శాసనసభాపక్షం నిర్ణయించింది.

Read more RELATED
Recommended to you

Latest news