మామూలుగా అనాదిగా వస్తున్న కొన్ని పద్ధతులు లేదా ఆచార వ్యవహారాలలో వరకట్నం కూడా ఒకటని తెలిసిందే. ఈ విషయంపై ఈ రోజు కేరళ హై కోర్ట్ ఒక సంచలన తీర్పును ఇచ్చింది. ఈ తీర్పును విన్న కొందరు అదేంటి వరకట్నం అడగడం చట్టరీత్య నేరం కదా.. హై కోర్ట్ ఏంటి ఇలాంటి తీర్పును ఇచ్చిందంటూ కన్ఫ్యూజ్ అవుతున్నారు. అందుకే కేరళ హై కోర్ట్ చాలా స్పష్టమైన విషయాలను ఈ తీర్పును జోడించి చెప్పడం జరిగింది. వరకట్నం అడగడం నేరం కాదు, అయితే కట్నం కోసం భర్త లేదా అతని బంధువులు అమ్మాయిని లేదా అమ్మాయి ఇంటి వారిని ఆస్తుల కోసం లేదా డబ్బు కోసం వేధించడం , బెదిరించడం వంటివి చేస్తే మాత్రమే సెక్షన్ 498A వారికి వర్తిస్తుంది అని క్లియర్ గా కోర్ట్ చెప్పింది. పెళ్లి సమయంలో ఇరు పక్షాలు అంగీకరించిన మేరకు కట్నం తీసుకోండి.. ఇవ్వకుంటే మళ్ళీ కొంతకాలానికి తీసుకోండి.
అంతే కానీ కట్నాన్ని అడ్డుగా పెట్టుకుని అమ్మాయిలను చిత్రహింసలు పెట్టడం, చంపడం వంటి చేయడం చట్టరీత్య నేరం అన్న అర్ధం లో సరిగ్గా చెప్పింది కేరళ హై కోర్ట్.