బాలికల అభివృద్ధికి…వారి చదువులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ప్రోత్సహించేందుకు వినూత్న పథకాన్ని ప్రవేశ పెట్టింది అస్సాం ప్రభుత్వం. రాష్ట్రంలో పెళ్లి చేసుకోబోయే ప్రతి అమ్మాయికు 10 గ్రాముల బంగారం కానుకగా అందించేందుకు కొత్త పథకానికి శ్రీకారం చుట్టుంది. ఈ పథకాన్ని బుధవారం ఎనౌన్స్ చేయడంతో పాటు విధివిధానాలు కూడా వెల్లడించింది. అరుంధతి బంగారు పథకం పేరుతో తీసుకొచ్చిన ఈ పథకం ద్వారా బాల్యవివాహాలను అరికట్టడం తోపాటు మహిళా సాధికారత లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఇందుకోసం సంవత్సరానికి 800 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది.
అయితే బంగారాన్ని డైరెక్ట్‌గా ఇవ్వకుండా.. రూ. 30 వేల నగదును ప్రభుత్వం వధువు అకౌంట్‌లో డిపాజిట్ చేయనుంది ప్రభుత్వం. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ పథకం అమల్లోకి రానున్నట్లు అసోం ఆర్థిక మంత్రి హిమంత బిశ్వశర్మ తెలిపారు. ఈ పథకానికి సంబంధించి అర్హతలతో పాటు కొన్ని విధివిధానాలు కూడా మంత్రి ప్రకటించారు. కనీస వివాహా వయస్సు వధువు (18), వరుడు (21) ఏళ్లు ఉండాలి.. వధువు కనీసం 10వ తరగతి వరకు చదువకొని ఉండాలి.. వివాహాన్ని తప్పనిసరిగా నమోదు చేయించాలి.. వధువు యొక్క వార్షిక కుటుంబ ఆదాయం 5 లక్షల రూపాయల కంటే తక్కువగా ఉండాలి.