Breaking: రష్యా అధ్యక్షుడిపై హత్యాయత్నం

-

రష్యా అధ్యక్షుడు వాద్లిమిర్ పుతిన్‌పై హత్యాయత్నం జరిగింది. ఉక్రెయిన్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ చీఫ్ మేజర్ జనరల్ కిరిలో బుదనోవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. నల్ల సముద్రం, క్యాస్పియన్ సముద్రం మధ్య ఉన్న కౌకసస్ ప్రాంతంలో పుతిన్‌పై హత్యాయత్నం జరిగినట్లు సమాచారం. గత రెండు నెలల క్రితం ఈ ప్రయత్నం జరిగినట్లు తెలుస్తోంది. మళ్లీ హత్యాయత్నం జరిగే అవకాశాలున్నాయన్నారు. కాగా, ఇటీవల పుతిన్ ఆరోగ్యంపై పుకార్లు వస్తున్న నేపథ్యంలో ఈ విషయం వెలుగులోకి రావడం చర్చనీయాంశమైంది.

వాద్లిమర్ పుతిన్
వాద్లిమర్ పుతిన్

ఉక్రెయిన్ మీడియాతో బుదనోవ్ ఈ విషయాన్ని ప్రకటించారు. పుతిన్‌పై హత్యాయత్నం జరిగిందని, కౌకసస్‌కు చెందిన ప్రతినిధులు పుతిన్‌పై దాడి చేశారని బుదనోవ్ తెలిపారు. అయితే హత్యాయత్నం విఫలమైందన్నారు. కాగా, మరోవైపు పుతిన్ సర్జరీ చేయించుకున్నట్లు సమాచారం. దీంతో పుతిన్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, అలాగే తనకు బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్లు ఓ రష్యా సంపన్నుడు వెల్లడించారు. కాగా, గతంలోనే తనపై అయిదు సార్లు హత్యాయత్న ప్రయత్నం జరిగినట్లు పుతిన్ ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news